Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యన్నపాత్రుడు ఒక సంస్కారహీనుడు: హోం మంత్రి సుచరిత

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (16:16 IST)
ముఖ్యమంత్రితో పాటు, తనపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యల వీడియోను మీడియాకు చూపిన హోం మంత్రి మేకతోటి సుచరిత ఆ తర్వాత ఆయ‌న్ని చెరిగిప‌డేశారు.

తాడేప‌ల్లిలో ఆమె ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, ఆయ‌న ఎంతో సీనియర్‌. ఎన్నో పదవులు పొందారు. మంత్రిగా కూడా పని చేశారు. ఆయన మాటలు నిజంగా సిగ్గుచేటు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక అధికారిణిని, బట్టలు విప్పించి కొడతానన్నాడు. అలాంటి వ్యక్తి నుంచి ఇంత కంటే మంచి మాటలు వస్తాయని అనుకోవడం లేదు. ఏం మాట్లాడాలి దీని గురించి, ఒక హోం మంత్రి గురించి, ఒక మహిళ గురించి ఏం మాట్లాడారో విన్నారు కదా. రాష్ట్రంలో ఉన్న ఎస్పీల గురించి ఏం మాట్లాడారో విన్నారు కదా. నేను ఒక దళితురాలిని కాబట్టి నా గురించి గత హోం మంత్రితో పోల్చి ఏం మాట్లాడారో చూశారు కదా. ఇంకా మరికొన్ని వాక్యాలు మనిషి పలకకూడనివి ఆయన మాట్లాడడం విన్నారు కదా....అని హోం మంత్రి సుచ‌రిత ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
 
వాస్తవానికి నేను దీనిపై స్పందించవద్దు అనుకున్నాను. కానీ రావాల్సి వచ్చింది. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని స్వయంగా చంద్రబాబు అన్నారు. కానీ మహానుభావుడు అంబేడ్కర్‌ జన్మించిన జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నాం. మీరు మాట్లాడిన భాషను, మేం ఈ జన్మలోనే కాదు. వచ్చే జన్మలోనూ మాట్లాడలేం. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది. గొప్పతనం అనేది మన ప్రవర్తను బట్టి వస్తుంది కానీ, కులం, జాతి వల్ల రాదు. ఒక మహిళను గురించి అలా మాట్లాడిన ఆ వ్యక్తి సంస్కారం ఏమిటన్నది అందరికి తెలుస్తుంద‌న్నారు సుచరిత‌.
 
నాకు సీఎంగారు తగిన గుర్తింపు ఇచ్చారు. 151 సీట్లు గెలిచి ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన సీఎంగారిపై ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడారు. మీరు 5 ఏళ్లు అధికారంలో ఉన్నారు. అన్నీ బాగా చేసి ఉంటే, ఓడిపోరు కదా. మీరు ఏం మాట్లాడారు. జైల్లో చిప్పకూడు తిన్న వ్యక్తిని సీఎం చేశారని అన్నారు. కానీ ఆయన ఏ పరిస్థితుల్లో జైలుకు వెళ్లారో అందరికీ తెలుసు. ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టి, మీకు తగిన గుణపాఠం చెప్పారు. ఆయనకు అధికారం కట్టబెట్టార‌ని హోం మంత్రి పేర్కొన్నారు.
 
వంగవీటి రంగా హత్య మీ హయాంలో జరిగింది. ఆ తర్వాత మీరు అధికారంలో ఉన్నప్పుడే ఒక ఎమ్మెల్యేను, మరో మాజీ ఎమ్మెల్యేను హత్య చేశారు. ఇంకా మీరు అధికారంలో ఉన్నప్పుడు విపక్షనేత జగన్‌పై హత్యాయత్నం జరిగితే, కోడి కత్తి దాడి అంటారా. నాడు మీరు సీఎంగా ఉన్నప్పుడు తిరుపతిలో మీపై హత్యాయత్నం జరిగితే, అప్పుడు విపక్షనేతగా ఉన్న వైయస్సార్‌ స్వయంగా వచ్చి పరామర్శించారు. మీకు అండగా నిల్చార‌ని మంత్రి గుర్తు చేశారు.
 
ఇవాళ సీఎం జగన్‌ కోరితే ఈ క్షణం రాజీనామా చేస్తాను. మీరు మా గురించి చాలా దారుణంగా మాట్లాడారు. మల్లెపూలు కట్టుకుని అమ్మే వాళ్లు మనుషులు కారా. ఇంకా మీ మాటలను సమర్థించుకునేందుకు పాస్టర్లు,  ఓ మై సన్‌ అంటారు కాబట్టి, తాను కూడా అన్నానని చెప్పడం అనైతికం. ఒక వ్యక్తి సంస్మరణ సభకు వచ్చి ఇలా మాట్లాడడం అంటే, మీ ముఖం చూడడానికి ఎవరూ ఇష్టపడడం లేదని అర్ధమవుతుంది. దళిత మహిళను హోం మంత్రిని చేస్తే, మీకు ఎందుకు కడుపు మంట? మీరు చేయలేని పనిని మా సీఎం చేశారు...అని సుచ‌రిత పేర్కొన్నారు.
 
మా పని తీరు బాగా లేదని మీరనుకుంటే ప్రశ్నించండి. అన్నింటికీ స్పష్టంగా సమాధానం చెబుతాం. కానీ వ్యక్తిగతంగా మాపై విమర్శలు చేయడం సరి కాదు. దిశ చట్టం ఇంకా అమలులోకి రాలేదు. దాని గురించి అడగండి చెబుతాం. మీ పాలనలో మహిళలకు ఏమేర న్యాయం చేశారో చెప్పండి. ఇప్పుడు మహిళలకు రక్షణ లేదనుకుంటే ఆధారాలు చూపండి. చంద్రబాబుగారికి మహిళలపై గౌరవం ఉంటే, ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. నాడు వనజాక్షిని కొట్టి, ఆమెనే తప్పు పట్టారు. ఇప్పుడు మాపై అర్ధం లేని విమర్శలు చేస్తున్నార‌ని హోం మంత్రి ఆరోపించారు. 
 
రాష్ట్రంలో 15 «శాతం నేరాలు తగ్గాయని నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో రికార్డులు చెబుతున్నాయి. కానీ దాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా మాస్కులు ధరించని వాటికి సంబంధించి నమోదైన 80 వేల కేసులను కూడా నేరాలుగా చూపి, రాష్ట్రంలో 64 శాతం కేసులు పెరిగాయని చంద్రబాబుగారు దుష్ప్రచారం చేస్తున్నార‌ని సుచ‌రిత ఆరోపించారు. 
 
నిన్న ఎమ్మెల్యే జోగి రమేష్‌ దాడికి వెళ్లారన్నారు. కానీ ఆయన ఒంటరిగా వెళ్లారు. విపక్ష నేతపై అలా దాడికి వెళ్తే, పోలీసులు చూస్తూ ఊర్కుంటారా. నాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అవన్నీ ప్రజలు చూశారు కాబట్టే, మిమ్మల్ని విపక్షంలో కూర్చోబెట్టారు. ఇప్పటికైనా మాటలు అదుపులో పెట్టుకోండి. ఇష్టానుసారం మాట్లాడవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాని హోం మంత్రి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments