Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుండీలో వంద వేస్తే... అందులో రూ. 21 ప‌న్నుకే పోతోంది!

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (11:38 IST)
ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి కొత్త దేవాదాయ సూత్రం చెప్పారు. హిందూ దేవాల‌యాల్లోని హుండీలో వంద రూపాయ‌లు భ‌క్తుడు వేస్తే, అందులో 21 రూపాయ‌లు ప‌న్నుల‌కే పోతోంద‌ని కొత్త లెక్క‌లు చెప్పారు.

ఏపీ లో వైసీపీ ప్ర‌భుత్వం న‌డుపుతోంది ఓటు బ్యాంక్ రాజకీయాలు కాదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతాలను వాడుకోవటం ఆపేయండి అని విష్ణువర్ధన్ రెడ్డి త‌న ట్విట్టర్ లో కామెంట్ చేశారు.

హిందూ ఆలయాలలో మీరు 100 రూపాయలు దేవుడికి భక్తి తో కానుకలు సమర్పస్తే, అందులో ప్రభుత్వం ఏంత తీసుకుంటుందో మీకు తెలుసా? 21.5 శాతం వివిధ రకాల పన్నుల రూపంలో వసూలు చేస్తోంది. అంటే 100 రూపాయలకు 21 రూపాయలు పైబడి ప్ర‌భుత్వం వ‌సూలు చేస్తోంది. పరిపాలనా వ్యవస్థ కోసం 8%, కామన్ గుడ్ ఫండ్ కింద 9%, అర్చకుల సంక్షేమం కోసం 3%, ఆడిట్ కోసం1.5% ఇలా 21.5% పన్నుల రూపంలో తీసుకోంటుంద‌ని ఆయ‌న వివ‌రించారు.

అదే విధంగా చర్చిలను, మసీదులను చట్ట పరిధిలోకి తీసుకొచ్చి... హిందూ ఆలయాల్లాగా పన్నులు ఎందుకు వసూలు చేయ‌డం లేద‌ని ఏపీ ప్ర‌భుత్వాన్ని ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఒక విధంగా హిందూ దేవాల‌యాల‌పై ప్ర‌భుత్వం త‌న భారం అంతా మోపుతోంద‌ని, భ‌క్తుల సొమ్ము కైంక‌ర్యం చేస్తోంద‌ని ఆయ‌న భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments