Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళికూతురు ముందే పెళ్ళికొడుకును అక్కడ పట్టుకున్న హిజ్రాలు

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (19:58 IST)
తిరుపతిలో హిజ్రాల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నాయి. ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పెళ్ళిమండపాలకు వెళుతూ పెళ్ళికొడుకు, పెళ్ళి కూతుర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆశీర్వాదం అంటూ వారి నుంచి 10 వేల నుంచి 20 వేలు వసూలు చేస్తున్నారు. ఇక ఇవ్వకపోతే..అంతే సంగతి.
 
తిరుపతి సమీపంలోని తిరుచానూరు కళ్యాణమండపంలో ఒక వివాహం జరుగుతుండగా హిజ్రాలు రెచ్చిపోయారు. నేరుగా పెళ్ళిమండపంలోకి వచ్చిన 30 మంది హిజ్రాలు పదివేలు ఇవ్వాలంటూ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురును చుట్టుముట్టారు. కాసేపు బంధువులను కూడా రానివ్వలేదు.
 
అంతేకాదు పెళ్లికొడుకు భుజంపై చేయివేసి మెల్లగా సైగ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో పెళ్ళికొచ్చిన వారు హిజ్రాల చేష్టలను చూసి ఆశ్చర్యపోయారు. వారిని ఏమీ అనలేక సైలెంట్‌గా ఉండిపోయారు. 
 
ఎంతకూ హిజ్రాలు వెళ్ళకపోవడంతో చివరకు 10 వేలు ఇవ్వాల్సి వచ్చింది. నగదు తీసుకునేంత వరకు అక్కడి నుంచి కదల్లేదు హిజ్రాలు. ఇలా గత కొన్నిరోజులుగా హిజ్రాలు హల్చల్ చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments