Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాల్గెట్-పామోలివ్ లిమిటెడ్‌తో ఇపిఎల్ లిమిటెడ్ భాగస్వామి అయింది

Advertiesment
కాల్గెట్-పామోలివ్ లిమిటెడ్‌తో ఇపిఎల్ లిమిటెడ్ భాగస్వామి అయింది
, బుధవారం, 1 సెప్టెంబరు 2021 (19:38 IST)
భారతదేశంలో రీసైకిల్ చేయదగిన ప్లాటినా టూత్‌పేస్ట్ ట్యూబ్‌లను ఉత్పత్తి చేయ్యడానికి అతి పెద్ద నోటి సంరక్షణ బ్రాండ్లలో ఒకటైన కాల్గెట్-పామోలివ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ప్రపంచంలోనే అతి పెద్ద స్పెషాలిటీ ప్యాకేజింగ్ కంపెనీ, ఇపిఎల్ లిమిటెడ్ (ఇదివరకు ఎస్సెల్ ప్రోప్యాక్ లిమిటెడ్‌గా ప్రసిద్ధం) ఈ రోజు ప్రకటించింది. ఈ మొదటి విడత రీసైక్లబుల్ ట్యూబ్‌లు కాల్గెట్-పామోలివ్ కోసం 100% రీసైకిల్ చేయదగిన ట్యూబ్‌లుగా మార్చడానికి ఆరంభ దశ అవుతుంది.
 
ఇపిఎల్, ట్యూబ్ ప్యాకేజింగ్ రంగంలో మార్కెట్ లీడర్, సుస్థిరత విషయంలో పెరుగుతున్న వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ప్రపంచస్థాయి ట్యూబ్ ప్యాకేజింగ్ నవ్యావిష్కరణలు తేవడానికి కట్టుబడి ఉంది. అత్యున్నత పనితీరునూ, కీలక ఉత్పత్తి లక్షణాలు మరియు సామర్థ్యాల విషయంలో రాజీపడకుండా ఉండడాన్నీ దృష్టిలో ఉంచుకొని, కాల్గెట్-పామోలివ్ కోసం ఈ తరహాలో ఇవే మొదటివైన రీసైక్లబుల్ ప్లాటినా ట్యూబ్‌లను ఇపిఎల్ ఆవిష్కరించింది.
 
దేశవ్యాప్తంగా ఇటువంటి ఒక ప్రయత్నాన్ని భారతదేశంలో ప్రారంభిస్తున్న మొట్టమొదటి నోటి సంరక్షణ బ్రాండ్ అయిన కాల్గెట్-పామోలివ్‌తో భాగస్వామి అవుతున్నందుకు ఇపిఎల్ సంతోషిస్తోంది. ఇపిఎల్స్ అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ రీసైక్లర్స్ ద్వారా ఈ నవ్యావిష్కరణ సాధ్యమయింది. కాల్గెట్ యాక్టివ్ సాల్ట్, కాల్గెట్ వేదశక్తిలను యుఎస్ఎ (ఎపిఆర్) ఆమోదించిన 100% రీసైక్లబుల్ మరియు పూర్తి రీసైక్లబుల్ ప్లాటినా ట్యూబ్‌లలో ప్యాక్ చెయ్యడంతో మొదలుపెట్టి, వారి జాబితాలోని ఇతర బ్రాండ్లకు అనుసరించడం జరుగుతుంది.
 
ఈ సందర్భంగా, దీపక్ గుంజూ, ప్రెసిడెంట్, ఎఎంఇఎస్ఎ, ఇపిఎల్ లిమిటెడ్ మాట్లాడుతూ, “చాలా సంవత్సరాలుగా కాల్గెట్-పామోలివ్ ఇండియాతో భాగస్వాములమైనందుకు మేము గర్వపడుతున్నాం, ఈ భాగస్వామ్యం మార్గదర్శకమైన మొదటివి ఎన్నిటినో మేము సృష్టించేలా చెయ్యగలిగింది, రీసైక్లబుల్ ట్యూబ్‌లలోకి మొట్టమొదటిసారిగా మార్పిడుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ప్యాకేజింగ్ ఆవిష్కరణకు సుస్థిరత పునాదిరాయి అని మేము విశ్వసించి ముందుకు సాగుతున్నాం, సుస్థిరమైన ప్యాకేజింగ్‌లో అంతర్జాతీయంగా ఇపిఎల్ అగ్రగామిగా ఉంది. బ్రాండ్ ఆవశ్యకాలకు, మన పర్యావరణంపై ఏమాత్రం ప్రభావం ఉండకూడదనే మా దార్శనికతకు అనుగుణంగా, సరికొత్త సుస్థిరమైన ట్యూబ్ ప్యాకేజింగ్ పరిష్కారాలను అందించడం కోసం ఇతర అన్ని బ్యాండ్లతో భాగస్వాములు కావడానికీ మేము కట్టుబడి ఉన్నాం” అని చెప్పారు.
 
ఇపిఎల్ వారి ప్లాటినా, ఒక పర్యావరణ అనుకూలమైన లామినేటెడ్ ట్యూబ్, ఎలాంటి అవరోధ లక్షణాలనూ కోల్పోకుండానే సోర్స్ రిడక్షన్, రీసైక్లబిలిటీలను అందించడం కోసం డిజైన్ చేసినది. ఉత్పత్తి నిలకడ, ప్యాక్ చేసిన పదార్థం దుకాణాల్లో నిల్వ ఉండే మన్నిక స్థిరంగా ఉండేలా ఇది దోహదం చేస్తుంది. ప్లాటినా ట్యూబ్  ఓరల్ మరియు బ్యూటీ & కాస్మోటిక్స్ ఉత్పత్తులకు ప్రత్యేకించి అనువుగా ఉంటుంది. ప్లాటినా ట్యూబ్‌లు మరియు క్యాప్‌లు 100 శాతం రీసైకిల్ చెయ్యదగినవిగా అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ రీసైక్లర్స్ (ఎపిఆర్) నుంచి ధ్రువీకరణను,  ‘కోడ్ 2’ కోసం (రీసైక్లింగ్) రీసైక్లాస్ యూరోపియన్ సర్టిఫికేషన్‌ను పొందాయి, అది అంతర్జాతీయంగా, 100 శాతం రీసైకిల్ చేయదగినవిగా గుర్తింపు పొందిన మొదటి స్పెషాలిటీ ప్యాకేజింగ్ ట్యూబ్‌లు మరియు క్యాప్‌లుగా వీటికి గుర్తింపు తెచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దు అన్నందుకు.. బాలిక ఆత్మహత్య... ఎక్కడ?