ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దు అన్నందుకు ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం బసినికొండలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కి ఉరివేసుకొని టీనేజర్ బలవన్మరణానికి పాల్పడింది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఎస్.సల్మా(17)… ఈ మధ్య ఫోన్ ఎక్కువగా మాట్లాడుతోంది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు తరచూ ఫోన్ వాడొద్దని… ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావంటూ మందలించారని స్థానికులు తెలిపారు.
కుటుంబ సభ్యులు గద్దించడంతో మనస్తాపం చెందిన సల్మా… ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.