Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈసారి ఎండలే ఎండలు.. దక్షిణాదిన సాధారణం 43 డిగ్రీలు

ఈ యేడాది వేసవి కాలంలో ఎండలు మండిపోనున్నాయి. సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. ముఖ్యంగా, దక్షిణాదిలో ఏకంగా 43 నుంచి 45 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్, విశాఖపట్

Webdunia
బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (08:51 IST)
ఈ యేడాది వేసవి కాలంలో ఎండలు మండిపోనున్నాయి. సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. ముఖ్యంగా, దక్షిణాదిలో ఏకంగా 43 నుంచి 45 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్, విశాఖపట్టణం వాతావరణ కేంద్రాలు వెల్లడిస్తున్నాయి. దీనికి కారణం.. ఈ యేడాది అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ శీతాకాలం సుదీర్ఘంగా కొనసాగుతుండటమే. అంటే పలు ప్రాంతాల్లో గరిష్ట స్థాయిలో చలి నమోదవుతుంది.
 
మార్చి నుంచి మే నెల వరకు గల వేసవిలో ఉత్తర, వాయువ్య భారతాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. ముఖ్యంగా వాయువ్య భారతంలో అసాధారణ ఎండలు ఉంటాయి. దక్షిణాదిలో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయని పలు వాతావరణ సంస్థలు చెబుతున్నాయి. 
 
అసాధారణ ఉష్ణోగ్రతలకు తోడు అదేసమయంలో వచ్చే నైరుతి రుతుపవనాలు చురుగ్గా వుంటాయని చెబుతున్నారు. అయితే ఉత్తరాది కంటే వాయువ్య భారతం ప్రధానంగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో వేసవి ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఎడారి మీదుగా వీచే గాలులతో వాయువ్య భారతం దానికి ఆనుకుని మధ్యభారతం వేడెక్కే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర, వాయువ్య భారతాలతో పోల్చితే దక్షిణాదిలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదుకావచ్చు.
 
మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో అత్యధికంగా 43-47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదువుతుందని అంచనా వేస్తున్నట్లు బేగంపేట వాతావరణశాఖ డైరెక్టర్‌ వైకే రెడ్డి తెలిపారు. ఏప్రిల్‌, మే నెలల్లో అనేకచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలుగా పరిగణిస్తారు. అక్కడక్కడా 42 నుంచి 43 డిగ్రీలు కూడా సాధారణం కిందే లెక్క. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటితే ఎండ ప్రభావం ఉంటుందని చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments