Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదలందరికీ ఇల్లు పథకానికి ఏపీ హైకోర్టులో లైన్ క్లియర్!

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (13:38 IST)
పేదలందరికీ స్థలాలు పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని హైకోర్టు సింగిల్ బెంచ్ అక్టోబ‌రు 8న ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. దీనిపై ఏపీ హైకోర్టులో సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానికి ఊరట లభించింది. పేదలందరికీ ఇల్లు పథకంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. దీనితో ఇపుడు ఇళ్ల స్థలాల పై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. 
 
 
గత నెల 8న పేదలందరికీ స్థలాలు పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని తీర్పు ఇచ్చింది. నవరత్నాల అమల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని, అత్యవసర విచారణ జరపాలని కోరింది. ఈ అప్పీలును అత్యవసరంగా విచారించేందుకు అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి నిరాకరించారు.


పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో తాత్కాలికంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం దీనిపై విచారణ జరిపిన హైకోర్టు  సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది. ఇక పేద‌ల‌కు ప్ర‌బుత్వం ఇచ్చిన సెంటు స్థ‌లంలో ఇళ్ల నిర్మాణానికి అడ్డంకి తొలిగిన‌ట్లే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments