Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు విరుగుడు కనిపెట్టిన గ్లెన్‌మార్క్.. ఇపుడు హెటిరో కంపెనీ కూడా...

Webdunia
ఆదివారం, 21 జూన్ 2020 (15:37 IST)
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు భారత ఫార్మా దిగ్గజ కంపెని గ్లెన్‌మార్క్ మందును కనిపెట్టింది. గ్లెన్ మార్క్ ఫార్మా సంస్థ ఫాబిఫ్లూ పేరుతో ఫావిపిరావిర్ టాబ్లెట్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గ్లెన్ మార్క్‌కు అనుమతులు మంజూరు చేసింది. 
 
ఇప్పుడు, కరోనా చికిత్సలో ఓ ఇంజెక్షన్ కూడా సమర్థవంతంగా పనిచేస్తుందని గుర్తించిన భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఆమేరకు అనుమతులు మంజూరు చేసింది. ఆ మందు పేరు రెమ్ డెసివిర్. కోవిఫర్ పేరుతో మార్కెట్లోకి రానున్న ఈ ఔషధాన్ని హైదరాబాద్‌కు చెందిన హెటెరో ఫార్మా సంస్థ తయారు చేసింది. 
 
మరో ఫార్మా సంస్థ సిప్లా కూడా ఈ ఔషధానికి అనుమతులు దక్కించుకుంది. కోవిఫర్ తయారీకి, మార్కెటింగ్‌కు డీజీసీఐ సిప్లా, హెటెరో సంస్థలకు ఆదివారం క్లియరెన్స్ ఇచ్చింది. 
 
మరోవైపు, హెటెరో సంస్థ ఇప్పటికే లక్ష కోవిఫర్ డోసులను సిద్ధం చేసింది. ఇంజెక్షన్ రూపంలో ఉన్న ఈ యాంటీ వైరల్ డ్రగ్ నేటి నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. 100 ఎంఎల్ పరిమాణంలో ఉన్న ఒక్కో ఇంజెక్షన్ ధర రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ఉంటుందని భావిస్తున్నారు. 
 
హెటెరో వర్గాలు దీనిపై మాట్లాడుతూ, కరోనా లక్షణాలన్నింటిపైనా కోవిఫర్ సమర్థవంతంగా, సమగ్రంగా పనిచేస్తుందని తెలిపాయి. కరోనా చికిత్సలో తొలిరోజున ఒక 200 ఎంజీ డోసు ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని, ఆపై ఐదు రోజుల పాటు 100 ఎంజీ డోసు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించాయి.
 
వాస్తవానికి రెమ్ డెసివిర్ ఔషధం తాలూకు పేటెంట్ హక్కులు అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ ఫార్మా సంస్థ వద్ద ఉన్నాయి. ఈ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్న సిప్లా, హెటెరో సంస్థలు భారత్‌లో కోవిఫర్ పేరుతో ఇంజెక్షన్లు మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి.
 
హెటెరో గ్రూప్ చైర్మన్ డాక్టర్ బి.పార్థసారథి రెడ్డి దీనిపై స్పందిస్తూ... క్లినికల్ ట్రయల్స్‌లో కోవిఫర్ సానుకూల ఫలితాలు ఇచ్చిందని, తమకు అన్ని అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఇప్పటినుంచే భారత్‌లోని కరోనా రోగులందరికీ అందుబాటులోకి ఈ ఔషధాన్ని తీసుకువస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments