Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ హీరో రామ్ పోతినేనికి గాయాలు... జిమ్ చేస్తుండ‌గా...

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (15:04 IST)
టాలీవుడ్ హీరోల‌కు ఒక్కొక్క‌రూ యాక్సిడెంట్ల పాల‌వుతున్నారు. ఇటీవ‌ల స్పోర్ట్స్ బైక్ యాక్సిడెంట్ లో హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ గాయ‌ప‌డిన సంఘ‌ట‌న నుంచి ఇంకా కోలుకోక‌ముందే తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో హీరో గాయ‌ప‌డ్డాడు. యువ న‌టుడిగా తనదైన ప్రత్యేక శైలితో ఆడియన్స్ ను ఆకట్టుకొని, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు హీరో రామ్ పోతీనేని గాయ‌ప‌డ్డాడు. ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న 19 సినిమా  'రాపో19' షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తుండ‌గా, రామ్ ఫిజిక్ కోసం విప‌రీతంగా వ‌ర్క్ అవుట్స్ చేస్తున్నాడు. ఆయ‌న జిమ్ వ‌ర్క‌వుట్ చేస్తుండ‌గా, ఒక్క‌సారిగా గాయ‌ప‌డ్డాడ‌ట. దీనితో ఆయ‌న త‌ల, మెడ న‌రాలు బెణికాయ‌ట‌. దీనితో రామ్ ఆసుప‌త్రి పాల‌వ‌గా, మెడ‌కు చికిత్స చేసి, మెరుగు అయ్యే వ‌ర‌కు షూటింగులు అన్నీ కాన్సిల్ అయిపోయాయ‌ట‌.
  
టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమాను రామ్ అభిమానులు 'రాపో19' గా పిలుస్తున్నారు.  రాపో19 సినిమాలో రామ్ సరసన ఉప్పెన ఫేమ్ 'కృతి శెట్టి హీరోయిన్'గా నటిస్తోంది. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య విలన్ గా నటిస్తున్నాడు. ఈ షూటింగ్ ముమ్మ‌రంగా సాగుతుండ‌గా, ఇపుడు రామ్ జిమ్ చేస్తూ గాయ‌ప‌డ‌టం ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్నాయి. రామ్ కు గాయం కావడంతో సినిమా షూటింగు నిలిపివేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments