Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ రిటైర్డ్ జేఈవో ల‌క్ష్మీకాంతంకు హీరో ఆఫ్ సొసైటీ అవార్డు అవార్డు

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (11:39 IST)
మాజీ ఐఏఎస్ అధికారి, టీటీడీ రిటైర్డ్ జేఈవో బి.లక్ష్మీకాంత్‌కు హీరో ఆఫ్ సొసైటీ అవార్డు ప్రదానం చేశారు. కృష్ణ జిల్లా పూర్వపు కలెక్టర్‌గా ప‌నిచేసి, తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగా రిటైర్ అయిన లక్ష్మీకాంత్‌కు న్యూఢిల్లీకి చెందిన నవ్య సర్జన్ సంస్థ ఈ అవార్డును ప్ర‌క‌టించింది. న్యూఢిల్లీలోని ఈస్ట్ కైలాష్‌లో ఇస్కాన్ ఆడిటోరియంలో ఈషాస్ సెకండ్ ఛాన్స్ పేరిట జరిగే ఆర్గాన్ డోనేషన్ ఫ్యాషన్ షోలో ఆ సంస్థ ఫౌండర్ కంచన్ సింగ్, చైర్ పర్సన్ రంజిత్ కుమార్ హీరో ఆఫ్ సొసైటీ అవార్డును ప్రదానం చేశారు,
 
న్యూఢిల్లీకి చెందిన నవ్య సర్జన్ సంస్థ ఆధ్వర్యంలో ఆయన హీరో ఆఫ్ సొసైటీ అవార్డు అందుకున్నందుకు బి.లక్ష్మీకాంత్‌ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. స‌మాజానికి సేవ చేసిన వారికి త‌గిన గుర్తింపు ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌ని, ఇలాంటి సేవా కార్య‌క్ర‌మాలు నిరంత‌రం కొన‌సాగాల‌ని లక్ష్మీ కాంతం ఆకాంక్షించారు. తాను ప‌ద‌వీ విర‌మ‌ణ చేసినా, ఏపీలో స‌మాజ సేవ‌లో ముఖ్య భూమిక పోషిస్తున్నాన‌ని, అక్క‌డి ప్ర‌భుత్వం కూడా త‌న సేవ‌ల్ని వినియోగించుకునే అవ‌కాశాన్ని క‌ల్పించింద‌ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments