Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం బంధువు, మా అధ్య‌క్షుడు మంచు విష్ణుకు చెప్ప‌కుండానే....

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (16:25 IST)
జ‌గ‌న్ నాకు శ్రేయోభిలాషి, ఆయ‌న‌తో క‌లిసి భోజ‌నం చేశా... అంటూ, హీరో నాగార్జున గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టులో త‌న‌ని క‌లిసిన మీడియాకు చెప్పారు. అయితే, సీఎంతో ఏం చ‌ర్చించార‌నేది మాత్రం చెప‌లేదు. ఏపీ సీఎం జగన్‌తో ప్రముఖ సినీ హీరో నాగార్జున భేటీ కావ‌డం సినీ వ‌ర్గాల్లో ఓ హ‌ఠాత్ ప‌రిణామంగా భావిస్తున్నారు. 
 
ఏపీలోని విజ‌య‌వాడ స‌మీపంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జ‌గ‌న్ ని నాగార్జున కలిశారు. నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డి సహా మరి కొందరు సీఎంతో భేటీ అయ్యారు. సీఎం జగన్‌తో కలిసి నాగార్జున మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన వివిధ అంశాలపై జగన్‌తో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.
 
సీఎం జ‌గ‌న్ నాకు శ్రేయోభిలాషి... క‌లిసి చాలా రోజులు అయింది. ఈ రోజు విజ‌య‌వాడ‌కు రావ‌డం నాకు చాలా ఆనందంగా ఉంది. సీఎం జ‌గ‌న్ తో క‌లిసి భోజ‌నం చేశా... అని హీరో నాగార్జున చెప్పారు. మీరు ఏఏ అంశాల‌పై చ‌ర్చించార‌ని ప్ర‌శ్నిస్తే, ఆయ‌న ఒక న‌వ్వు న‌వ్వేసి కారు ఎక్కేశారు. గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టుకు వ‌చ్చి, తిరిగి హైద‌రాబాదుకు ప‌యనం అయ్యారు నాగార్జున‌.
 
సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన అంశాలపై ఒక చ‌ర్చ జ‌ర‌గాలి అని నిర్మాత‌లు, హీరోలు క‌లిసి నాగార్జున‌ను సీఎం జ‌గ‌న్ వ‌ద్ద‌కు పంపార‌ని స‌మాచారం. మా ఎన్నిక‌లు జ‌రిగి, మంచు విష్ణు అధ్య‌క్షుడు కాగా, ఆయ‌న ప్ర‌మేయం కూడా లేకుండా నేరుగా నాగార్జున సీఎం జ‌గ‌న్ ని క‌లిశారు. నాగార్జున చేసిన ఈ రాయ‌బారం ఎంత‌వ‌ర‌కు స‌ఫ‌లం అవుతుందో వేచిచూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments