Basara: గోదావరి నదిలో వరద ఉద్ధృతి.. 40 ఏళ్ల తర్వాత గోదావరి మళ్లీ ఉప్పొంగింది..(video)

సెల్వి
శనివారం, 30 ఆగస్టు 2025 (10:07 IST)
Basara
నిర్మల్ జిల్లాలోని బాసరలో గోదావరి నది వరద ఉద్ధృతి కారణంగా తీవ్ర నష్టం సంభవించింది. వరదనీరు బాసరను ముంచేసింది. బాసర ఆలయ పరిసర ప్రాంతాలను, పుష్కర ఘాట్ల వద్ద వరద నీరు చేరింది. ఆలయానికి వెళ్ళే మార్గాలు పూర్తిగా జలమయమయ్యాయి. మూడు లాడ్జ్‌లు, ఒక ప్రైవేట్ అతిథి గృహం వరద నీటిలో చిక్కుకున్నాయి. తొమ్మిది కుటుంబాలు వరద నీటిలో చిక్కుకుని బాధపడుతుండగా, పోలీసులు, స్థానికులు వారికి ఆహార సహాయం అందిస్తున్నారు. 
 
బాసర వద్ద గోదావరి 40 ఏళ్ల తర్వాత మళ్లీ ఉప్పొంగింది. 1984లో భారీ స్థాయిలో వచ్చిన వరద కారణంగా పుష్కర ఘాట్లు మునిగి నీరంతా రోడ్డుపైకి చేరింది. మరోసారి ప్రస్తుతం గోదావరి పోటెత్తడంతో వరద గంగమ్మ విగ్రహం, శివాలయం దాటి శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలోకి చేరింది. దీంతో అప్రమత్తమైన ఆఫీసర్లు ఆలయం నుంచి గోదావరి నది వైపు వెళ్లే మార్గాన్ని మూసేశారు. గోదారమ్మ శాంతించాలంటూ ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి, సౌభాగ్య ద్రవ్య సమర్పణ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments