Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిఫ్ట్ ఇచ్చాడు, మత్తు మందు ఇచ్చి లాడ్జికి తీసుకెళ్ళి అత్యాచారం చేసాడు

Webdunia
శనివారం, 31 జులై 2021 (16:04 IST)
యువతిని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డ వివాహితుడి ఉదంతం తిరుపతిలో వెలుగులోకి వచ్చింది. తిరుపతి రూరల్ మండలానికి చెందిన ఒక యువతి ఈ నెల 28వ తేదీన సాయంత్రం తిరుపతి నగరంలోకి రావడానికి ఆటో కోసం ఎదురుచూస్తోంది. ఎంతసేపటికి ఆటో రాలేదు. 
 
అటువైపుగా వెళుతున్న తిరుపతి బిటిఆర్ కాలనీకి చెందిన నాగేంద్రబాబు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళుతూ యువతిని గమనించాడు. ఆమెకు మాయమాటలు చెప్పాడు. నగరంలో విడిచిపెడతానని నమ్మించాడు.
 
ఆ తరువాత నగరంలోకి రాగానే కూల్‌డ్రింగ్ తాగుదామన్నాడు. నాగేంద్రబాబు నిజస్వరూపం తెలియని యువతి సరేనంది. అప్పటికే తన దగ్గర ఉన్న నిద్రమాత్రలను కూల్‌డ్రింక్‌లో కలిపి యువతికి ఇచ్చేశాడు. దీంతో ఆ యువతి డ్రింక్ తాగగానే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది.
 
శ్రీనివాసం వసతి సముదాయాల సమీపంలో తన స్నేహితుడు నడుపుతున్న లాడ్జికి ఆ యువతిని తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు నాగేంద్రబాబు. ఆమె మేల్కొన్న తరువాత విషయం బయటకు చెబితే చంపేస్తానన్నాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆ యువతి ఇంటికి వెళ్ళిపోయింది. 
 
అయితే ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు ప్రశ్నించగా అసలు విషయాన్ని బయటపెట్టింది. నాగేంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments