Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్య చాలా మంచిది.. ఆమెకు రెండో పెళ్లి చేయండి.. సూసైడ్ లెటర్‌లో భర్త

Webdunia
ఆదివారం, 26 జనవరి 2020 (17:50 IST)
ఓ బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతడి సూసైడ్ లెటర్‌లో తన భార్యకు రెండో పెళ్లి చేయాల్సిందిగా తండ్రిని కోరాడు. ఈ ఘటన హైదరాబాదులోని జూబ్లిహిల్స్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంకు చెందిన చిత్తలూరి శ్రావణ్ కుమార్ (29)జూబ్లిహిల్స్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి ఏడాది క్రితం సూర్యపేటకు చెందిన హరితతో వివాహం జరిగింది.  
 
శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చిన శ్రావణ్ గదిలోకి వెళ్లి.. తనతో పాటు తెచ్చుకున్న విషాన్ని.. మద్యంలో కలుపుకుని తాగేశాడు. కాసేపటికి ఆ బాధను తట్టుకోలేక.. తలుపులను కొట్టాడు. దొంగలని భయపడిన కుటుంబసభ్యులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూసేలోపే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
ఆ లేఖలో 'తన చావుకు ఎవరూ కారణం కాదని.. తన తండ్రికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని, నేను అప్పు ఇచ్చిన వ్యక్తి డబ్బులు ఇచ్చే దాకా నాకు కర్మఖాండ చేయొద్దని, అలాగే తన భార్య చాలా మంచిదని.. ఆమెకు వేరే పెళ్లి చేయాలని కోరాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్లు రెంటర్ సిస్టమ్ వద్దు- పర్సెంటేజ్ ముద్దు : కె.ఎస్. రామారావు

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments