Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీమా సొమ్ము కోసం కన్నతండ్రినే కారుతో ఢీకొట్టించిన కుమారుడు...

ఠాగూర్
ఆదివారం, 3 ఆగస్టు 2025 (13:16 IST)
బీమా సొమ్ము కోసం కన్నతండ్రినే కారుతో ఢీకొట్టించి హత్య చేసేందుకు ప్లాన్ చేశాడో కన్నతండ్రి. అయితే, ఈ ప్రమాదం నుంచి ఆ తండ్రి బయటపడటంతో ఆ పథకం బెడిసికొట్టింది. దీంతో ఈ కేసులో కిరాతక కుమారుడుని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే... 
 
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ పరిధిలోని సాకుర్రు గ్రామానికి చెందిన హర్షవర్థన్ (24) డిప్లొమా చదివి ఖాళీగా ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడటంతో పాటు వైసీపీ కార్యక్రమాలకు సైతం డబ్బు ఖర్చు చేసి అప్పుల పాలయ్యాడు. తండ్రి వెంకటరమణ పేరుతో ఓ ఫైనాన్స్ సంస్థలో 2022లో రూ.13 లక్షల అప్పు తీసుకోవడంతో పాటు బీమా చేయించాడు. తండ్రి మరణిస్తే బీమా సొమ్ము వస్తుందని, అప్పు కూడా తీర్చాల్సిన అవసరం ఉండదని భావించిన హర్షవర్థన్ తండ్రిని హత్య చేసేందుకు పథకం వేశాడు.
 
ఈ క్రమంలో హర్షవర్థన్ ఈ ఏడాది ఏప్రిల్ 21న భట్నవిల్లి నుంచి తండ్రికి ఫోన్ చేసి తన వద్ద డబ్బులు లేవని, రూ.500 తీసుకురమ్మని కోరాడు. వెంకట రమణ అక్కడికి చేరుకుని డబ్బులు ఇచ్చి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్తుండగా, అప్పటికే అద్దెకు తీసుకున్న కారుతో సిద్ధంగా ఉన్న హర్షవర్థన్ మార్గమధ్యంలో తండ్రిని వెనుక నుంచి బలంగా ఢీకొట్టి వెళ్లిపోయాడు. తర్వాత తనకు ఏమీ తెలియనట్లు ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
అయితే ఆసుపత్రిలో చికిత్స పొందిన వెంకట రమణ కొద్దిరోజుల తర్వాత కోలుకున్నాడు. ప్రమాదం జరిగిన తీరు, హర్షవర్థన్ చెబుతున్న వివరాలపై అనుమానం రావడంతో పోలీసులు లోతుగా విచారణ జరిపారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఇంతలో నిందితుడు స్థానిక వీఆర్వో వద్ద లొంగిపోయాడు. హర్షవర్థన్ పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, కేసు వద్దని, కుమారుడు జైలు కెళ్తే తట్టుకోలేనని నిందితుడి తండ్రి పోలీసులను ప్రాధేయపడినట్లు తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments