Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం నోటిఫికేషన్ - సెప్టెంబరు 9న ఎన్నిక

Advertiesment
Jagdeep Dhankhar

ఠాగూర్

, శుక్రవారం, 1 ఆగస్టు 2025 (15:32 IST)
భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ రాజీనామాతో కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నిక సంఘం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ ఎన్నిక ప్రక్రియలో భాగంగా, సెప్టెంబరు 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. జగ్దీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి పదవికి ఇటీవల రాజీనామా చేసిన విషయం తెల్సిందే. దానిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజీనామాను ఆమోదించిన విషయంతెల్సిందే. 
 
ఈ ఎన్నిక కోసం ఆగస్టు 7వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. 21వ తేదీన నామినేషన్ దాఖలుకు చివరి తేదీ, 22వ తేదీన స్క్రూటీ ఉంటుంది. ఆగస్టు 25వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంటుంది. సెప్టెంబరు 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5వ తేదీన గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుంది. 
 
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ధన్కడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్యపరమైన కారణాలతో రాజీనామా చేసినట్టు ఆయన రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 2022 ఆగస్టు 11వ తేదీన ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్కడ్‌కు 2007 ఆగస్టు వరకు పదవీ కాలం ఉంది. ఆయన రెండేళ్ల ముందే వైదొలగిన విషయం వెల్లడించారు. 
 
పార్లమెంట్ ఉభయ సభల్లో వివిధ ఖాళీలతో కలిపి సభ్యులు సంఖ్య మొత్తం 786. మెజార్టీ 394మంది మద్దతు అవసరం. లోక్‌సభలో ఎన్డేయేకు 293 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో 129 మంది మద్దతు ఉంది. ఎన్డీయేకు 422 మంది, విపక్ష కూటమికి 313 మంది అనుకూలంగా ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్.. ప్రేమ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లాడు.. ఆపై అత్యాచారం