Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరికృష్ణ అంత్యక్రియలు.. అధికారికంగా నిర్వహించండి.. కేసీఆర్ ఆదేశం

కారు ప్ర‌మాదంలో మృత్యువాత ప‌డిన నందమూరి హ‌రికృష్ణ అంత్య‌క్రియ‌లు గురువారం శంషాబాద్ ద‌గ్గ‌ర ఉన్న సొంత ఫాం హౌజ్‌లో జ‌ర‌గ‌నున్నాయి. త‌న‌యుడు జాన‌కీరామ్ అంత్య‌క్రియ‌లు జ‌రిగిన స్థ‌లంలోనే హరికృష్ణ ఆఖ‌రీ మ‌

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (14:57 IST)
కారు ప్ర‌మాదంలో మృత్యువాత ప‌డిన నందమూరి హ‌రికృష్ణ అంత్య‌క్రియ‌లు గురువారం శంషాబాద్ ద‌గ్గ‌ర ఉన్న సొంత ఫాం హౌజ్‌లో జ‌ర‌గ‌నున్నాయి. త‌న‌యుడు జాన‌కీరామ్ అంత్య‌క్రియ‌లు జ‌రిగిన స్థ‌లంలోనే హరికృష్ణ ఆఖ‌రీ మ‌జిలి జ‌ర‌గ‌నుంది.
 
బుధవారం వేకువజామున నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ దుర్మరణం చెందిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన మృతదేహానికి కామినేని ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం పూర్తిచేసి భౌతికకాయాన్ని హరికృష్ణ కుటుంబ సభ్యులకు అందజేశారు. 
 
ఆ తర్వాత హరికృష్ణ పార్థివదేహాన్ని హైదరాబాద్ మెహిదీపట్నంలో ఉన్న నివాసానికి తరలించారు. కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిలు ఆయన భౌతికకాయాన్ని అంబులెన్సులో నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఇంటి లోపలకు తీసుకెళ్లారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్ తదితరులంతా ఇంట్లోకి వెళ్లారు. ఇంటి వద్ద బంధుమిత్రులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరోవైపు, ఇంటి వద్ద భారీ పోలీసు భద్రతను కల్పించారు. ఇక్కడకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడకు చేరుకుని, హరికృష్ణకు నివాళి అర్పించారు. 
 
ఇదిలావుండగా, దివంగత నందమూరి హరికృష్ణ అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. హరికృష్ణ కుటుంబసభ్యులతో మాట్లాడి, అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments