Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనివాస్ రెడ్డి సైకో కాదట.. అప్పుడెలా తోస్తే అలా చేసేవాడట..

Webdunia
మంగళవారం, 14 మే 2019 (13:19 IST)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైకో కిల్లర్ శ్రీనివాస్ కేసుపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మహిళలకు లిఫ్ట్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడి ఆపై హత్యచేసే దుర్మార్గుడు కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి.


యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను కిడ్నాప్ చేసి, అతి కిరాతకంగా అత్యాచారం చేసి చంపేసి, పాడుబడిన బావిలో పాతిపెడుతున్న సైకో శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు కొన్నిరోజుల కిందట అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
 
శ్రీనివాస్ రెడ్డిలో సైకో లక్షణాలు లేవని పోలీసులు చెప్పారు. నిందితుడి పోలీసు కస్టడీ సోమవారంతో ముగిసింది. అతణ్ని నల్లగొండ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు తర్వాత వరంగల్‌ జైలుకు తరలించారు. మహిళలపై అత్యాచారానికి పాల్పడేందుకు ఎలా తోస్తే అలా చేసేవాడినని పోలీసులకు శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. 
 
ఇకపోతే.. 600 మంది అమ్మాయిలతో ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్‌పైనా పోలీసులు అతడిని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై శ్రీనివాస్ రెడ్డి స్పందించాడని.. వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ మాత్రమే పంపానని.. యాక్సెప్ట్ చేశారని.. అంతకుమించి వారితో తనకు ఎలాంటి సంబంధాలు లేవని.. కనీసం చాటింగ్ కూడా చేయలేదని వెల్లడించినట్లు తెలుస్తోంది. 
 
ఇక వేములవాడ అమ్మాయిని శ్రీనివాస్ ప్రేమించాడని.. అందుకే ఆమెను చంపకుండా వదిలిపెట్టాడని ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రొఫైల్‌పిక్‌లో శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఉన్న ఓ యువతి గురించి కూడా పోలీసులు ఆరా తీశారు. వేములవాడకు చెందిన ఆ యువతి క్షేమంగానే ఉందని నిర్ధారించుకున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments