Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ హైకోర్టును తరలిస్తున్నారా? కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం ఏంటి?

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (14:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత వైఎస్. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇందులోభాగంగా, హైకోర్టును కర్నూలుకు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదలను కేంద్రానికి కూడా పంపారు. ప్రస్తుతం ఈ అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. 
 
ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో బీజేపీకి చెందిన సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రస్తావన తీసుకువచ్చారు. అమరావతి నుంచి హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నారా? అని జీవీఎల్ ప్రశ్నించగా, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బదులిచ్చారు.
 
ఏపీ హైకోర్టు తరలింపుపై 2020 ఫిబ్రవరిలో సీఎం జగన్ నుంచి తమకు ప్రతిపాదనలు అందాయని వెల్లడించారు. అమరావతి నుంచి కర్నూలు తరలింపు అంశంలో హైకోర్టు, ఏపీ సర్కారుదే తుది నిర్ణయం అని కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 
 
తరలింపుపై హైకోర్టు, ఏపీ ప్రభుత్వం మధ్య సంప్రదింపులు జరిగిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు. అందుకు ఏకాభిప్రాయం ముఖ్యమని తెలిపారు. హైకోర్టును కర్నూలు తరలించే విషయంలో నిర్దేశిత గడువు అంటూ ఏమీ లేదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. సరిగ్గా చెప్పాలంటే కర్నూలు తరలింపు అంశం ఏపీ హైకోర్టు పరిధిలోనే ఉందని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments