Webdunia - Bharat's app for daily news and videos

Install App

విధులు నిర్వహించి వస్తుండగా విధి వక్రీకరించి...

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (07:34 IST)
విధి వక్రించడంతో విధుల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ప్రమాదంలో ఓ ప్రభుత్వ వైద్యురాలు తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి మృత్యువుతో పోరాడుతూ చివరికి ఓడిపోయారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కాజాకు చెందిన డా. తనూజాభాయి(38) ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేస్తున్నారు. తొలుత గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో విధులు నిర్వహించారు. 
 
గత మూడేళ్లుగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దంత వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ఒంగోలులో నివాసం ఉంటూ విధులకు హాజరవుతుంటారు. ఈ నెల 18న విధులు ముగించుకుని కారులో తిరిగి ఒంగోలు వస్తున్నారు. 
 
అదేసమయంలో తిరుపతి వెళ్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న వైద్యురాలి వాహనాన్ని కనుమళ్ల జాతీయ రహదారి వద్ద వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఒంగోలులోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. 
 
వైద్యం అందిస్తుండగానే నాలుగు రోజుల క్రితం డెంగీ బారిన పడ్డారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆదివారం రాత్రి హైదరాబాద్‌ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆమె సోమవారం రాత్రి మృతి చెందారు. 
 
తనూజాభాయి భర్త కిరణ్‌ కుమార్‌ నాయక్‌ కూడా వైద్యునిగా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. వైద్యురాలి మృతికి స్థానిక వైద్యాధికారులు, సిబ్బంది నివాళి అర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments