Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో కలసి.. భర్త మర్మాంగాన్ని బిగబట్టి గాయపరిచి.. చంపేందుకు భార్య యత్నం

ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కాటికి పంపాలని నిర్ణయించుకుంది. ఇందులోభాగంగా, భర్త మర్మాంగాన్ని బిగబట్టి గాయపరిచి హత్య చేసేందుకు యత్నించింది. ఈ వివరాలను పరిశీలిస్తే గుంటూరు జిల్లా దుర్గి

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (10:21 IST)
ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కాటికి పంపాలని నిర్ణయించుకుంది. ఇందులోభాగంగా, భర్త మర్మాంగాన్ని బిగబట్టి గాయపరిచి హత్య చేసేందుకు యత్నించింది. ఈ వివరాలను పరిశీలిస్తే గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామానికి చెందిన మేకల సుధారాణి అదే గ్రామానికి చెందిన వీర నీలాంజనేయులు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొన్నేళ్లుగా కొనసాగిస్తోంది. తమ సంబంధానికి భర్త చిన అమ్మోరయ్య అడ్డుగా ఉన్నాడని భావించిన సుధారాణి ప్రియుడితో కలిసి భర్తను హతమార్చాలని ఓ ప్లాన్ వేసింది. 
 
అర్థరాత్రి దాటాక ప్రియుడు నీలాంజనేయులుకు ఫోన్‌ చేసి ఇంటికి రప్పించుకుంది. నిద్రిస్తున్న అమ్మోరయ్యను కడతేర్చేందుకు రంగంలోకి దిగారు. నీలాంజనేయులు దిండుతీసి అమ్మోరయ్య ముఖంపై ఉంచి ఊపిరాడకుండా చేస్తూ మరోవైపు ఇటుక రాయితో గుండెపై బాదుతుండగా సుధారాణి అమ్మోరయ్య మర్మాంగాన్ని బిగబట్టి గాయపరిచే యత్నంచేసింది. 
 
ఊహించని పరిణామం నుంచి అమ్మోరయ్య తేరుకొని వారిని ప్రతిఘటిస్తూ బిగ్గరగా కేకలు వేశాడు. పక్క ఇంట్లో నిద్రిస్తున్న అమ్మోరయ్య అన్న కుమార్తె అమల, తల్లి తిరుపతమ్మ పరిగెత్తుకుంటూ వచ్చారు. వారి రాకను పసిగట్టిన నీలాంజనేయులు తన ఇంటికి పారిపోగా సుధారాణి డాబాపై ఎక్కి దాక్కుంది. వారి దుర్మార్గంతో నిలువెల్లా రగిలిపోయిన అమ్మోరయ్య బంధువర్గీయులు నీలాంజనేయులు, సుధారాణిలను వెతికి పట్టుకొచ్చి దేహశుద్ధి చేశారు. వారిని తాళ్లతో కట్టేసి అదే ఇంట్లో తెల్లారేదాకా నిర్బంధించారు. అనంతరం దుర్గి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments