Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్, ప్రెస్ అని వాహనాల‌పై రాసి ఉంటే... కేసు నమోదు

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (10:37 IST)
ప్ర‌తి వాడూ బండిపైన పోలీస్ అని, ప్రెస్ అని రాసేసి, విచ్చ‌ల‌విడిగా రోడ్ల‌పై తిరుగుతున్నారు. అందుకే గుంటూరు పోలీసులు ఈ నిర్ణ‌యానికి వ‌చ్చారు. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి గుంటూరు అర్బన్ పోలీసులు వాహన తనిఖీల భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

ఎవ‌రైనా అర్హ‌త లేని వారు ప్రెస్ అని, పోలీస్ అని బండిపై రాస్తే, వారిని ఆపి విచారించారు. కొంతమంది వాహనాలపై పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేని వ్యక్తులు, మీడియా కు సంబంధం లేని వ్యక్తులు వారి వాహనాలపై పోలీస్,  ప్రెస్ మీడియా అని రాసుకొని  తిరుగుతున్నారు.  అర్బన్ పోలీసులు ఆ వాహనాలను ఆపి, క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని, డిపార్ట్మెంట్ కు సంబంధంచని పోలీస్ స్టిక్కర్ ఉన్న 20 టూ వీలర్స్ పై  పోలీస్ కేసు నమోదు చేశారు. అలానే మీడియా సంబంధం లేని 16 మంది  ప్రెస్ స్టిక్కర్  కలిగి ఉన్న వాహనాలపై కేసు నమోదు చేశారు. 
 
నగర ప్రజలందరూ ఇది గమనించి, పోలీసు ఉద్యోగి కాకుండా వాహనంపై పోలీస్ అని  రాసుకున్నట్లు అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు. అలానే మీడియా అంటూ సంబంధిత అధికారుల అర్హత కార్డు లేకుండా, ఎవరైతే వాహనాలపై ప్రైస్ అని కానీ, లేక మీడియా అని కానీ రాసుకొని తిరుగుతుంటే, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామ‌ని గుంటూరు అర్బన్ ఉన్నత పోలీసు అధికారులు తెలియజేశారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments