Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో రసవత్తరంగా రాజకీయాలు.. కలాం టవర్‌గా మార్చాలంటూ...

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (12:43 IST)
గుంటూరులోని జిన్నా టవర్ మరోమారు తెరపైకి వచ్చింది. ఈ టవర్‌పై ఉన్న జాతీయ జెండాను గుర్తుతెలియని వ్యక్తులు కొందరు తొలగించారు. దీంతో జిల్లా కేంద్రమైన గుంటూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
కాగా, జిన్నా టవర్‌ పేరును మార్చాలంటూ గత కొన్ని రోజులుగా బీజేపీ ఏపీ శాఖ శ్రేణులు, నేతలు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఈ టవర్‌కు అబ్దుల్ కలాం టవర్‌గా పేరు పెట్టాలంటూ వారు డిమాండ్ చేస్తూ వచ్చారు. 
 
ఈ నేపథ్యంలో ఈ వివాదం ముదరడంతో కార్పొరేషన్ అధికారులు జిన్నా టవర్‌కు జాతీయ రంగులు వేయించారు. అక్కడే జెండా దిమ్మను ఏర్పాటు చేసి జాతీయ జెండాను సైతం ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రితో సహా పలువురు నేతలు హాజరయ్యారు. 
 
ఇపుడు దిమ్మెతో ఉన్న జాతీయ జెండాను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడం చరీ్చనీయాంశంగా మారింది. జిన్నా టవర్‌ను అడ్డుపెట్టుకుని బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుందంటూ పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం
Show comments