Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితురాలిని బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం... ఎక్కడ?

Webdunia
ఆదివారం, 28 జూన్ 2020 (10:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో దారుణం జరిగింది. తోటి స్నేహితురాలిని బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమెను నగ్నంగా ఫోటోలు, వీడియోలు చిత్రీకరించి, ఆపై బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి ఒడిగట్టారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరుకు చెందిన ఓ యువతి మూడేళ్ల కిందట ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుతున్న సమయంలో అదే కళాశాలకు చదువుతున్న యువకుడితో పరిచయం అయింది. ఈ క్రమంలో ఆ యువకుడు మత్తుమందు కలిపిన శీతలపానీయం తాగించి ఆమెను లొంగదీసుకుని నగ్నదృశ్యాలు, వీడియో చిత్రీకరించాడు. 
 
ఆ వీడియోలను అడ్డుపెట్టుకొని ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడంతో ఆమె అతనికి దూరమైంది. తర్వాత ఆమె మరో యువకుడితో సన్నిహితంగా ఉండసాగింది. ఆ యువకుడి వద్దకూ స్నేహితుల ద్వారా ఆమె నగ్న చిత్రాలు, వీడియోలు చేరాయి. అతను వాటిని అంతర్జాలంలో పోస్టు చేసి, తర్వాత తొలగించాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు పరువుపోతుందనే భయంతో ఇద్దరు యువకులను సంప్రదించి తమ కుమార్తె వ్యవహారాన్ని వదిలివేయాలని వేడుకున్నారు. వారి వద్దనున్న ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆ యువతి నగ్నచిత్రాలు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమయ్యాయి. 
 
దీంతో కుటుంబ సభ్యులు దిశ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశాల మేరకు సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితులు వరుణ్‌, కౌశిక్‌లను అరెస్టు చేశారు. ఆమె నగ్న చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది ఎవరనేది తెలుసుకునేందుకు టెక్నికల్‌ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments