Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేపాల్‌ను మచ్చిక చేసుకున్న చైనా.. రోడ్డు మార్గం వచ్చేసిందిగా.. భారత్‌కు కొత్త చిక్కు!

నేపాల్‌ను మచ్చిక చేసుకున్న చైనా.. రోడ్డు మార్గం వచ్చేసిందిగా.. భారత్‌కు కొత్త చిక్కు!
, మంగళవారం, 23 జూన్ 2020 (18:34 IST)
Nepal_China
చైనా నేపాల్‌ను మచ్చిక చేసుకుని సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. వ్యాపార బంధం ద్వారా చైనా- నేపాల్ దగ్గరయ్యాయి. అంతే చిరకాల మిత్రుడిగా స్నేహ బంధాలు కొనసాగించిన నేపాల్ ప్రస్తుతం చైనా కనుసన్నల్లోని వెళ్లిపోయింది. ఈ బంధానికి ప్రతిరూపంగా ఇటీవలే... టిబెట్ రాజధాని లాసా నుండి నేపాల్ బోర్డర్‌లోని ఖాసా వరకూ చైనా- నేపాల్ ఫ్రెండ్షిప్ హైవే పేరిట రోడ్డు మార్గం డెవలప్ చేసింది.
 
సుమారు 800 కిలోమీటర్ల ఈ రహదారి చైనా-నేపాల్ మధ్య వాణిజ్యానికి ప్రధాన మార్గంగా మారింది. చైనాతో అనుసంధానించబడిన ఈ రహదారి నేపాల్‌ను కొడారి పట్టణంతో కలుపుతుంది. కొడారి నుండి ఖాట్మండు వరకు ఉన్న రహదారిని భౌగోళిక రాజకీయాల సమస్యగా మార్చారు.
 
చైనా, నేపాల్ సరిహద్దులను కలుపుతూ రోడ్డు నిర్మాణంతో భారత్ ఆందోళన తప్పలేదు. భారతదేశంపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మాత్రమే కొడారి హైవే ఒప్పందం కుదుర్చుకున్నట్లు నేపాల్ స్పష్టం చేసింది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 
 
అప్పుడు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని నేపాల్ రాయబారి మాట్లాడుతూ.. చైనాతో నేపాల్ కుదుర్చుకున్న ఒప్పందంపై భారత్ కోపంగా ఉంది. నేపాల్ చైనా అడుగుజాడల్లో పడుతోందని భారత్ భావిస్తుంది, కానీ అలా కాదు. నేపాల్ ఎప్పటికీ చైనా బంటుగా మారదని తెలిపారు. కానీ ఇటీవల నేపాల్ ఇటీవల మ్యాప్‌ను మార్చడం, రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా సరిహద్దు వివాదానికి ఆజ్యం పోసింది. 
 
ఈ విషయాన్ని పక్కనబెడితే.. చైనా- నేపాల్ ఫ్రెండ్షిప్ హైవే పేరిట ఏర్పాటైన ఈ రహదారిని రెండు వేర్వేరు రహదారులను కలపడం ద్వారా నిర్మించారు. ఈ రహదారి లాసా నుండి లాట్సే వరకు ప్రయాణించి, ఆపై దక్షిణ దిశగా నేపాల్ సరిహద్దుకు చేరుకుంటుంది. ఈ రహదారి రెండో భాగం లాట్సే నుంచి టిబెట్ పశ్చిమాన గార్ ప్రాంతానికి చేరుకుంటుంది. అయితే ఈ రహదారి కైలాష్ పర్వతం, మానస సరోవర్ పర్వతాలకు వెళ్ళే పర్యాటకులకు ఉపయోగపడుతుంది.
 
లాసా నుండి నేపాల్ బోర్డర్ వరకూ ఈ రహదారిపై చాలా సుందరమైన, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి, అయితే ఈ రహదారికి భౌగోళికంగా,  వ్యూహాత్మకంగా కూడా ప్రాముఖ్యత ఉంది. ఎవరెస్ట్ శిఖరం కూడా రహదారికి వెళ్లే మార్గంలోనే ఉంది. ఈ రహదారి ముగుస్తున్న చోట, చైనా, నేపాల్ సరిహద్దులో ఫ్రెండ్షిప్ వంతెన ఉంది. 
 
అయితే ఈ సరిహద్దులోని కొడరి అనే పట్టణం నుండి ఈ రహదారి ఖాట్మండుకు మరో ప్రత్యేక రహదారి ఉంది. దీనిని ఆర్నికో హైవే అని పిలుస్తారు. అంటే చైనా, నేపాల్ ఫ్రెండ్షిప్ వంతెన ద్వారా, ఎర్నికో రహదారిని జతచేస్తే, చైనాలోని లాసా నుంచి ఖాట్మండు వరకు పూర్తి మార్గం సిద్ధంగా ఉంది.
 
ఈ రహదారి చైనా - నేపాల్ మధ్య వాణిజ్యానికి జీవనాడి. 2015 భూకంపం, ఆ తరువాత జరిగిన పరిణామాలతో నేపాల్ సరిహద్దులను భారత్ మూసివేసింది. దీంతో వాణిజ్యం కూడా నిలిపివేసింది. ఆ సమయంలో భూకంపం కారణంగా చిక్కుకున్న నేపాల్ ప్రజలు, నేపాల్ నాయకులు వాణిజ్యం కోసం కేవలం ఒకే దేశంపై ఆధారపడితే కష్టాలకు గురవుతామని అందుకు ప్రత్యామ్నాయంగా చైనాతో వాణిజ్యానికి తెరలేపాల్సి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: ఎవరి అండా లేకుండా నింగికెగిసిన తార.. అర్థంతరంగా నేల రాలడానికి కారణాలు ఏమిటి? బాధ్యులు ఎవరు?