గురజాలలో దారుణం... రైతుపై దుండగుల దాడి.. వీడియో వైరల్

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (10:50 IST)
గుంటూరు జిల్లా గురజాలలో దారుణం చోటుచేసుకుంది. తుమ్మలచెరువుకు చెందిన సైదాబి అనే రైతుపై దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. పొలం దారి విషయంలో ఈ దాడి జరిగిందని బాధితుడైన రైతు కుమారుడు జిలానీ చెప్పారు.  
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల తుమ్మల చెరువు లోట్ ప్లాజా వద్ద ఓ వ్యక్తిపై అత్యంత దారుణంగా దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వ్యక్తిని రోడ్డు డివైడర్‌పై పడేసి కొందరు వ్యక్తులు, కాళ్లు, చేతులు పట్టుకోగా మరో వ్యక్తి బండరాయి కొడుతున్నాడు. బాధితుడు నొప్పితట్టుకోలేక కేకలు పెట్టాడు.
 
పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన సైదాబి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా పిడుగురాళ్ల శివారులో ప్రత్యర్థులు శివారెడ్డి, హేమంత్‌రెడ్డి, పున్నారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, అన్నపురెడ్డి, నరసరావుపేటకు చెందిన కొంతమంది దాడికి పాల్పడ్డారు. పొలంగట్ల వివాదంతో ఈ దాడి జరిగిందని బాధితుడు తెలిపాడు.
 
ఇనుప రాడ్లు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన వ్యక్తిని సైదాబిగా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో 108 వాహనంలో బాధితుడిని నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments