Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యాయం చేయ‌డం లేద‌ని... ఎల‌క‌ల మందు తాగారు...

Webdunia
సోమవారం, 25 జులై 2016 (18:51 IST)
గుంటూరు నగరంలోని ఎస్పీ ఆఫీసు గ్రీవెన్స్‌లో ముగ్గురు వ్యక్తులు సోమవారం ఎలకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో  సిబ్బంది బాధితులను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జిల్లా కేంద్రంలోని బొంగరాలబీడు- రెండవలైన్‌లో నెలపాటి నిర్మల అనే మహిళకు ఓ ఇల్లు ఉంది. దీనిని స్థానికుడైన అంబేద్కర్‌కు సంవత్సరం కింద లక్ష రూపాయలకు తాకట్టు పెట్టింది. 
 
నెల క్రితం ఇంటిని విడిపించుకోవడానికి వెళితే అంబేద్కర్ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితులు అరండల్ పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినా అక్కడ న్యాయం జరగక పోగా, పోలీసులు కూడా అంబేద్కర్‌కే సపోర్ట్ చేస్తున్నారు. దీంతో సోమ‌వారం జిల్లా ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేయడానికి నిర్మల, ఆమె కుమారుడు భానుప్రకాశ్, ఆమె అక్క కుమార్తె కుమారీలు వచ్చారు. 
 
ఫిర్యాదు చేసిన అనంతరం తమకు న్యాయం చేయాలంటూ వెంట తెచ్చుకున్న ఎలకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అడ్డుకున్న సిబ్బంది వారిని హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ డ్రాగన్ చిత్రం లేటెస్ట్ అప్ డేట్

తెలుగు అమ్మాయిలంటే అంత సరదానా! ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ పై మండిపాటు

నన్నెవరూ ట్రాప్‌లో పడేయలేరు, నాతో పెదనాన్న వున్నాడు: మోనాలిసా భోంస్లే

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments