Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీలోకి రోజా వస్తానంటే అభ్యంతరం లేదు... మంత్రి సునీత, ఏంటి సంగతి?

ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి చేరేటప్పుడు గతంలో చేసిన తప్పే మరోసారి చేయకూడదన్నది వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా గట్టిగా పాటిస్తున్నట్టు ఉన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్‌ వైసీపీ నేతలందరూ కలిసి రెండు రోజుల క్రితం నగరిలో జరిగిన విస్తృత

Webdunia
సోమవారం, 25 జులై 2016 (18:16 IST)
ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి చేరేటప్పుడు గతంలో చేసిన తప్పే మరోసారి చేయకూడదన్నది వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా గట్టిగా పాటిస్తున్నట్టు ఉన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్‌ వైసీపీ నేతలందరూ కలిసి రెండు రోజుల క్రితం నగరిలో జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వంపై అందరు కలిసి దుమ్మెత్తి పోశారు. రోజా నోరు తెరిస్తే ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. కాని ఎవ్వరూ ఊహించని విధంగా రోజా మాత్రం పెద్దగా ప్రభుత్వంపై గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై గానీ ఎక్కడా కూడా నోరు జారలేదు.
 
ఇలా చేయడానికి కారణం కూడా లేకపోలేదు. అధికారంలో ఉన్న పార్టీ లోకి లేటైనా పరవాలేదు.. కాని చేరి తీరుతాను.. అన్నట్టుగా ఉంది రోజా వైఖరి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చేపట్టిన నవనిర్మాణ దీక్షలో కనిపించి వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కు షాక్‌ ఇచ్చింది. దీనికి తోడు రోజా టీడీపీలోకి వస్తానంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలుగు దేశం పార్టీ ఎమెల్యే పరిటాల సునీత మొన్నీమధ్య స్పష్టం చేశారు. రోజా అనుచరులు మాత్రం వెంటనే టీడీపీలో చేరిపోదామని బలవంతం చేసినా రోజా మాత్రం ఇది సరైన సమయం కాదని కొద్దిగా ఓపిక పట్టండని, దానికి ఒక సమయం వస్తుందని చెప్పుకొచ్చినట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments