Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు తీర్చమన్న మహిళ.. కాలితో తన్నిన ఆటో డ్రైవర్

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (15:40 IST)
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ దారుణం జరిగింది. తన వద్ద తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాలని ఓ మహిళ కోరింది. దీంతో ఆగ్రహించిన ఆటో డ్రైవర్ ఆ మహిళను కాలితో తన్నాడు. దీంతో ఆ మహి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. బాధితురాలు ప్రస్తుతం మంగళగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా చిర్రావూరుకు చెందిన గోపీకృష్ణ అనే యువకుడికి గోవర్ధని అనే మహిళ గతంలో వడ్డీకి రూ.3 లక్షలు అప్పు ఇప్పించింది. అప్పు తీర్చమని అడుగుతుంటే గోపి పట్టించుకోలేదు. దీంతో గోపి స్వగ్రామం చిర్రావూరు వెళ్లి బాకీ తీర్చాలని అడిగింది. 
 
ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన గోపి.. గోవర్ధనిని కాలితో బలంగా తన్నాడు. దీంతో ఆమె కుప్పకూలింది. అక్కడికి కాసేపటికి 100 నంబరుకు గోవర్ధని ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మంగళగిరి రూరల్‌ పోలీసులు గోపీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments