Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారి.. లాక్కెళ్లి చంపి తినేసిన చిరుతపులి

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (16:57 IST)
గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్ జిల్లాలో దారుణం జరిగింది. ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారిని ఓ చిరుతపులి లాక్కెళ్లి చంపుకుని తినేసింది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు స్పష్టంచేశారు. అయితే, ఇలాంటి సంఘటన జరగడం ఇది గడచిన నెల రోజుల్లో మూడోది కావడం గమనార్హం. ఈ విషాదకర ఘటన దాహోద్ జిల్లాలోని సంగసర్ గ్రామ సమీపంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సోమవారం సాయంత్రం ధన్‌పూర్ తాలూకాలో తన ఇంటి వెలుపల ఆడుకుంటున్న చిన్నారిని చిరుత లాక్కెళ్లిందని వాసియా దుంగ్రీ అటవీ శ్రేణి అధికారి మహేశ్‌ పర్మార్ తెలిపారు. మంగళవారం ఉదయం సగం తిన్న మృతదేహం అడవిలో లభించగా అది ఆ బాలికదేనని గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.
 
ఆగస్టు 8న అదే తాలూకాలోని కాంటు గ్రామంలో ఒక పిల్లవాడిని చిరుతపులి చంపి తినేసింది. జూలై 26న ఖాజురి గ్రామ సమీపంలో ఒక గొర్రెల కాపరి చిరుత దాడిలో మృతిచెందాడు. జూలై, ఆగస్టులో ఈ ప్రాంతంలో చిరుతపులులు మనుషులపై దాడి చేసిన అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. అడవుల్లో సుమారు 24 పులుల వరకు దాగి ఉన్నాయని ఆయన అంచనా వేశారు. 
 
ఈ ప్రాంతంలోని 12 గ్రామాల్లో చిరుతల దాడులు షరామామూలేనని పర్మార్ తెలిపారు. చిరుత పులులను పట్టుకోవడానికి జనావాసాల దగ్గర వివిధ ప్రదేశాల్లో అనేక బోన్లు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. అదేప్రాంతంలో సోమవారం రాత్రి ఒక చిరుతపులి పట్టుబడిందని, అయితే ఇదే చిరుత బాలికపై దాడి చేసిందా అనేది మాత్రం స్పష్టంగా తెలియదని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments