Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యా కేంద్రాలు పునఃప్రారంభానికి మార్గదర్శకాలు

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (07:24 IST)
అన్ లాక్ 4.0లో భాగంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను ఈనెల 21 నుంచి పునఃప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత శిక్షణ విభాగాల్లో కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.  
 
1. నేపథ్యం:
కోవిడ్-19 నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం దశలవారీగా అన్ లాక్ పేరుతో అనుమతులు ఇస్తూ వస్తోంది. అన్ లాక్ 4.0లో భాగంగా నైపుణ్య మరియు వ్యవస్థాపకత శిక్షణా కార్యక్రమాలకు కూడా అనుమతులు ఇచ్చింది. డాక్టరల్ కోర్సులు, ఉన్నత విద్యా ప్రయోగశాలలు, సాంకేతిక మరియు వృత్తిపరమైన కార్యక్రమాలను అమలు చేసే సంస్థలు కూడా ఈ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. 
 
2. పరిధి:
నైపుణ్యం లేదా వ్యవస్థాపకత (ఎంట్రప్రెన్యూర్షిప్) శిక్షణలో బోధన మరియు శిక్షణా కార్యకలాపాలను సురక్షితంగా తిరిగి ప్రారంభించడం కోసం ఈ మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేదా స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేదా స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్షిప్ అధ్వర్యంలోని స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్లు, షార్ట్ టర్మ్ ట్రైనింగ్ సెంటర్లలలో నైపుణ్య శిక్షణా కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం జరిగింది.
 
3. సాధారణ నివారణ చర్యలు: 
కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడానికి సాధారణ ప్రజలు తీసుకునే ప్రజారోగ్య చర్యలన్నింటినీ ఇక్కడ కూడా అందరూ (అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు మరియు సందర్శకులు) పాటించాలి.  
• సాధ్యమైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లో కనీసం 6 అడుగుల దూరం పాటించాలి
• ఫేస్ కవర్లు / మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలి. 
• సబ్బుతో (కనీసం 40-60 సెకన్ల పాటు) తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. మీ చేతులు మురికిగా కనిపించకపోయినా శుభ్రం చేసుకోండి. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ (కనీసం 20 కి
  సెకన్లు) శుభ్రం చేసుకోవాలి.
• దగ్గు, తమ్ములు వచ్చినపుడు తప్పనిసరిగా మోచేతలను అడ్డుపెట్టుకోవడం లేదా కర్చీఫ్, టిష్యూ పేపర్ ఉపయోగించాలి. టిష్యూ పేపర్ ను పారవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
• ఆరోగ్యపరిస్థితులను ఎప్పటికప్పుడూ గమనిస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా అనారోగ్యకర లక్షణాలు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి
• శిక్షణ కేంద్రం పరిసరాల్లో, డస్ట్ బిన్లలో, వాష్ రూమ్ లలో ఉమ్మివేయడం నిషేధించబడింది.
• ప్రతిఒక్కరూ ఆరోగ్యసేతు యాప్‌ ఇనిస్టాల్ చేయడంతోపాటు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి.
 
4. నైపుణ్య మరియు వ్యవస్థాపకత (ఎంట్రప్రెన్యూర్షిప్) శిక్షణ ఇచ్చే సంస్థలు మరియు డాక్టరల్ కోర్సులు, పీజీ కోర్సులను అమలు చేస్తున్న ఉన్నత విద్యా సంస్థలు ఆయా కేంద్రాల్లో ఈ కింది ఇవ్వబడిన ఏర్పాట్లు చేయాలి. 
• ఆన్‌లైన్ / దూరవిద్యలకు అనుమతించడం జరిగింది. దాన్నే కొనసాగించాలని ప్రోత్సహించండి. 
• నైపుణ్య లేదా వ్యవస్థాపకత కేంద్రాల్లో శిక్షణలకు ఈనెల 21 నుంచి అనుమతి ఉంటుంది.
• పీహెచ్‌డీ లేదా సాంకేతిక, వృత్తిపరమైన కార్యక్రమాలు నిర్వహించే ఉన్నత విద్యా సంస్థలు, ప్రయోగశాలలను తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఉన్నత విద్యాశాఖ అనుమతిస్తుంది.  
 
4.1 శిక్షణా కేంద్రాలు ప్రారంభించడానికి ముందు:
a)  శిక్షణా కేంద్రాలను తిరిగి తెరవడానికి:
• నైపుణ్య మరియు వ్యవస్థాపకత శిక్షణ ఇచ్చే సంస్థలు మరియు డాక్టరల్ కోర్సులు, పీజీ కోర్సులను అమలు చేస్తున్న ఉన్నత విద్యా సంస్థలు కంటైన్మెంట్ జోన్లకు బయట ఉంటేనే అనుమతించడం జరుగుతుంది. కంటైన్మెంట్ జోన్లలో నుంచి వచ్చే విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బందిని శిక్షణా కేంద్రాలకు అనుమతించకూడదు. కంటైన్మెంట్ జోన్లలో ఉండే శిక్షణ కేంద్రాలకు విద్యార్థులు, స్టాఫ్ కూడా వెళ్లకూడదు. 

• నైపుణ్య మరియు వ్యవస్థాపకత శిక్షణ ఇచ్చే సంస్థలు మరియు డాక్టరల్ కోర్సులు, పీజీ కోర్సులను అమలు చేస్తున్న ఉన్నత విద్యా సంస్థలు తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ముందుగానే హాస్టల్లు, ల్యాబొరేటరీలు మరియు అందరూ కలిసి ఉపయోగించే సాధారణ స్థలాలు, అక్కడ తరచూ తాకే వస్తువులు, ప్రాంతాలను 1% సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రపరచాలి. 

• నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో ఉపయోగించే పరికరాల మధ్య దూరం కనీసం ఆరు అడుగులు ఉండాలి. స్థలం అందుబాటులో ఉంటే ఆయా పరికరాలను ఆరుబయట లేదా వరండాలలో అమర్చి భౌతికదూరం పాటించేలా చూడాలి.
• బయో మెట్రిక్‌ హాజరు పద్దతి అవసరం లేదు. వీలైనంత వరకు కాంటాక్ట్ లెస్ ప్రత్యామ్నాయ పద్దతుల ద్వారా సిబ్బంది హాజరును గుర్తించే ఏర్పాట్లు చేసుకోవాలి.
• శిక్షణా కేంద్రంలోని ప్రాంగణం లోపల మరియు వెలుపల 6 అడుగుల దూరంతో నిర్ధిష్టమైన గుర్తులను వేయాలి. 
• అత్యవసరమైతే ఫ్యాకల్టీ, ట్రైనీలు, ఇతర సిబ్బంది సంప్రదించడానికి వీలుగా రాష్ట్ర హెల్ప్‌లైన్ నంబర్లను మరియు స్థానిక ఆరోగ్య అధికారుల నంబర్లను అక్కడ ప్రదర్శించాలి. 
• ఎయిర్ కండిషనింగ్ పరికరాల ఉష్ణోగ్రత 24-30 డిగ్రీలు, తేమశాతం 40-70% పరిధిలో ఉండాలి.  స్వచ్ఛమైన గాలి తీసుకోవడం కోసం అవసరమైన వెంటిలేషన్ సదుపాయాలు ఉండాలి.
• విద్యార్థుల లాకర్లను భౌతిక దూరం పాటిస్తూ, ఎప్పటికప్పుడు క్రిమిసంహారకం చేస్తూ వినియోగించాలి. 
• వ్యాయామశాలలు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ మార్గదర్శకాలను అనుసరించి ప్రారంభించవచ్చు. 
• స్విమ్మింగ్ పూల్స్ (వర్తించే చోట) మూసివేయాలి. 
• సిబ్బంది మరియు విద్యార్థులు ఏమి చేయాలి? ఏం చేయకూడదు అన్న వివరాలతో కూడిన పోస్టర్లు మరియు స్టాండీలు తప్పనిసరిగా ప్రదర్శించాలి.  
 
4.2 బోధన మరియు శిక్షణా కేంద్రాలు తెరిచిన తర్వాత:
a) ప్రవేశ మార్గం దగ్గర:
 
• ప్రతి ప్రవేశమార్గంలో తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకొనేందుకు శానిటైజర్‌ తోపాటు థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేయాలి. వీలైతే లోపలికి వెళ్లడానికి ఒకమార్గం, బయటకు రావడానికి మరో మార్గం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. 
• సాధారణ టెంపరేచర్, ఎలాంటి లక్షణాలు కనిపించని ఉద్యోగులు/ విద్యార్థులు/ సందర్శకులను మాత్రమే లోపలికి అనుమతించాలి. ఒకవేళ ఎవరైనా లక్షణాలున్నట్టు గుర్తిస్తే దగ్గర్లోని హెల్త్ సెంటర్ ను రెఫర్ చేయాలి. 
• పోస్టర్లు/ స్టాండీస్ ను కోవిడ్-19 రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తప్పకుండా ప్రదర్శించాలి. 
• పార్కింగ్ ప్రదేశాలు, లిఫ్టుల దగ్గర రద్దీగా ఉండకుండా భౌతికదూరం పాటిస్తూ వెళ్లేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 
• రోజువారీగా వచ్చే సందర్శకులను నియంత్రించాలి. తాత్కాలికంగా విజిటర్స్ ను నిలిపివేయాలి. 
 
b) క్లాసు రూమ్ లో బోధించే సమయంలో:
 
• క్లాసు రూమ్ లో కూర్చునే చోట ఒక్కొక్కరి మధ్య 6 అడుగుల దూరం ఉండేలా చూడాలి.
• క్లాసు రూమ్స్ లో బోధన సమయాలు కూడా వేర్వేరుగా ఉండాలి. వీలైనంతమేరకు క్లాస్ రూములను క్రిమిసంహారం చేయడంతోపాటు విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చూడాలి.
• క్లాసులు జరుగుతున్నంతసేపు విద్యా్ర్థులు, అధ్యాపకులు తప్పనిసరిగా మాస్కును ధరించే ఉండాలి.
• ల్యాప్ టాప్స్, నోట్ బుక్స్, పెన్సిల్స్, పెన్నులు, వాటర్ బాటిళ్లు తదితర వస్తువులను ఇతరులతో పంచుకోకుండా చూడాలి. 
 
c) వర్క్ షాపులు/ ల్యాబొరేటరీల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి:
 
• వర్క్ షాపులు/ ల్యాబొరేటరీల్లో తరచూ ఉపయోగించే, తాకే పరికరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి
• పరికరాలు / వర్క్ స్టేషన్‌లో పనిచేయడానికి ఒక వ్యక్తికి 4 మీటర్ల చొప్పున నేల విస్తీర్ణం ఉండేలా చూసుకోవాలి. 
• శిక్షణా సామగ్రిని ఉపయోగించే ముందు మరియు తరువాత తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇందుకోసం వర్కస్టేషన్లు/ సిములేషన్ ల్యాబ్స్ లో హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.  
 
d) లైబ్రరీ, క్యాంటీన్, వ్యాయామశాలలు, ఇతర సాధారణ ప్రదేశాల్లో:
 
• భౌతిక దూరం కనీసం 6 అడుగులు ఉండేలా చూసుకోవాలి
• లైబ్రరీ, క్యాంటీన్, వ్యాయామశాలలు, ఇతర సాధారణ ప్రదేశాల్లో ఉన్నపుడు తప్పకుండా మాస్కును ధరించాలి
• క్యాంటీన్లు మూసివేసి ఉండాలి
• సాధ్యమైనంత వరకు నగదు చెల్లింపులకు బదులు ఆన్ లైన్ చెల్లింపులు చేయాలి.
 
e) రవాణా సదుపాయాలు:
 
• శిక్షణ కేంద్రం ద్వారా రవాణా సదుపాయాలు కల్పిస్తున్నట్టయితే ప్రతిరోజూ బస్సులు, ఇతర రవాణా సాధనాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడంతోపాటు భౌతిక దూరం పాటించేలా చూడాలి. 
 
5) పరిశుభ్రత మరియు శానిటేషన్:
 
• ప్రతిరోజూ అన్ని ప్లోర్లను తప్పనిసరిగా శుభ్రం చేయించాలి.
• టాయిలెట్లు ఇతర కామన్ ప్రదేశాల్లోనూ తగినంత స్థాయిలో సబ్బు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. 
• తరచూ తాకే ప్రదేశాలయిన (డోర్ నాబ్స్, లిఫ్టు బటన్స్, కుర్చీలు, బెంచీలు, వాష్ రూమ్ ఫిక్సెర్స్) తదిరాలను 1శాతం సోడియం హైపోక్లైట్ ద్రావణంతో కలిసి తరచూ క్రిమీసంహారం చేయాలి. అంతేకాకుండా క్లాసు రూములు, ల్యాబొరేటరీలు, లాకర్లు, పార్కింగ్ ప్రదేశాలు ఇతర సాధారణ ప్రదేశాల్లో క్లాసులు ప్రారంభించడానికి ముందు, అయిపోయాక క్రిమీసంహారకం చేయాలి.
• టీచింగ్ మెటీరియల్స్, కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్, ప్రింటర్లను 70శాతం ఆల్కాహాల్ ద్రావణంతో క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.
• వాష్ రూమ్స్, మరుగుదొడ్లు, వాషింగ్ స్టేషన్లను కూడా ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. 
• ఉపయోగించిన మాస్కులు, చేతి కవర్లను వేర్వేరు డబ్బాల్లో పారవేయాలని విద్యార్థులు, సిబ్బందికి సూచించాలి. తరగతి గదులు, ఇతర ప్రదేశాల్లోనూ డస్ట్ బిన్లు అందుబాటులో ఉంచాలి. అందులో పారవేసిన మాస్కులను మూడు రోజుల తర్వాత సాధారణ వ్యర్థపదార్థాలతో కలిపి పారవేయాలి
• నివాస భవనాలు ఏవైనా ఉంటే వాటిని కూడా క్రమం తప్పకుండా శానిటైజ్ చేయాలి. 
 
6. రిస్క్ కమ్యునికేషన్:
 
• శిక్షణా కేంద్రం నుంచి బయటకు వెళ్లేటప్పుడు, ఖాళీ సమయాల్లో గుంపులుగా ఉండడం వంటి చేయకుండా అవగాహన కల్పించాలి.  
• అంతేకాకుండా సాధారణ రక్షణ చర్యలయిన తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, శ్వాస సంబంధిత జాగ్రత్తలు, భౌతిక దూరం, మాస్కు ధరించడంపైనా అవగాహన కల్పించాలి. 
• ఆందోళన మరియు మానసిక ఒత్తిడికి గురవుతున్న వారికి రెగ్యులర్ కౌన్సిలింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలి.
• ఒకవేళ విద్యార్థి లేదా అధ్యాపకులు అనారోగ్యానికి గురైతే వారు ఇనిస్టిట్యూట్ కి రాకుండా అవసరమైన ప్రొటోకాల్స్ పాటిస్తూ ఇంట్లోనే ఉండాలి.
 
7. హాస్టల్స్, గెస్ట్ హౌస్ లు ఇతర నివాస ప్రదేశాలు:
 
• హాస్టల్స్, ఇతర నివాస ప్రదేశాల్లో ఉండేవారు తప్పకుండా మాస్కులు, ఫేస్ కవర్లు, శాటిటైజర్లు, భౌతిక దూరం పాటించాలి. 
• స్థానికంగా ఉండే వారు కాకుండా ఇతర నగరాలకు, ఇతర ప్రదేశాలకు చెందిన వారు, ఆన్ లైన్ లో చదువుకునే అవకాశం లేని వారికి మాత్రమే హాస్టల్స్ రూమ్స్ కేటాయించాలి.
• శిక్షణ నిమిత్తం హాస్టల్స్ లో ఉండడానికి వచ్చేవారు 14 రోజుల ముందు నుంచే క్వారంటైన్ లో ఉంటూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితులను సమీక్షించుకోవాలి. 
• రూములు, డార్మెటరీల్లో ఒక్కొక్కరి బెడ్లను కనీసం 6 అడుగుల దూరం ఉండేలా చూడాలి. 
• మెస్ సదుపాయం ఉన్నట్టయితే తప్పకుండా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. మెస్ లో రద్దీ తగ్గించేందుకు అవసరమైతే భోజనం చేసే సమయాలను వేర్వేరుగా ఏర్పాటు చేయాలి. 
 
8. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిలో కోవిడ్ లక్షణాలు కనిపించినట్టయితే:
 
• కోవిడ్ లక్షణాలు కనిపించిన వారిని వెంటనే ప్రత్యేక గదిలో ఉంచాలి. 
• అవసరమైతే వారి తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు తెలియజేయాలి
• డాక్టర్ వచ్చి పరీక్షించే వరకు మాస్కు లేదా ఫేస్ కవర్ ధరించి ఐసోలేషన్ లోనే ఉండాలి.
• వెంటనే దగ్గరల్లో ఉన్న ఆస్పత్రి లేదా క్లినిక్ గానీ, రాష్ట్ర లేదా జిల్లాస్థాయి హెల్ప్ లైన్ కి కాల్ చేయాలి.
• ఒకవేళ ఆ వ్యక్తి పాజిటివ్ అని నిర్ధారణ అయితే ఆ ప్రదేశాన్నంతా క్రిమిసంహారకం చేయాలి.
• హాస్టల్ లేదా నివాస ప్రదేశంలో మరిన్ని కేసులు వచ్చినట్టయితే స్థానిక వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలి. 
 
 ప్రభుత్వం వారు ఎప్పటికప్పుడు సూచిస్తున్న అటువంటి స్వీయ జాగ్రత్తలతోనే  కరోనా ని సమిష్టిగా ఎదుర్కోగలుగుతాము 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లరి నరేష్ మాస్ చిత్రం బచ్చల మల్లి డేట్ ఫిక్స్

పుష్ప 2: ది రూల్‌లో రష్మిక మందన్న చనిపోతుందా? పుష్పది హీరోయిజమా?

రాజు వెడ్స్ రాంబాయి క్లైమాక్స్ చూశాక నిద్రపట్టలేదు : వేణు ఊడుగుల

అల్లు అర్జున్ గురించి నిజాలు బయటపెట్టిన మాత్రుమూర్తి నిర్మల

ఎన్ని జరిగినా భార్య వెన్నుముకలా వుంది: జానీ మాస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments