Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ఏపీ మార్గదర్శకాలు

Advertiesment
విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ఏపీ మార్గదర్శకాలు
, గురువారం, 20 ఆగస్టు 2020 (08:32 IST)
కోవిడ్-19 వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో ఏపీ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈమేరకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా కోవిడ్-19 ఇన్ స్టెంట్ ఆర్డర్-75ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 
 
* విమానం ఎక్కేందుకు కనీసం 72 గంటల ముందు తప్పనిసరిగా www.spandana.ap.gov.in ఆన్ లైన్ పోర్టల్‌లో సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
అసరమైతే ప్రయాణీకులు తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్ లో ఉండేందుకు అంగీకరిస్తూ సెల్ఫ్‌-డిక్లరేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. (పెయిడ్ క్వారంటైన్ కోరుకునేవారు ఖర్చులను భరించాలాల్సి ఉంటుంది).
 
* తీవ్రమైన జబ్బులు ఉన్న వారికి, గర్భిణులకు, పదేళ్లలోపు ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే వారిని చూడడానికి వెళ్తున్న ప్రయాణికులందరూ క్వారంటైన్‌కు బదులుగా 14 రోజుల హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
 
* అంతే కాకుండా ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌ (ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే క్వారంటైన్‌ కేంద్రాలు) నుంచి మినహాయింపు పొందాలనుకునే వారు కోవిడ్ నెగెటివ్‌ ఉన్నట్లు నిర్ధారించే ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకున్న రిపోర్టును ప్రయాణికులు తప్పనిసరిగా జత చేయాలి.
 
ఇలాంటి ప్రయాణీకులకు నేరుగా 14 రోజులు హోం క్వారంటైన్ కు వెళ్లే అవకాశం కల్పిస్తారు.  ఆ టెస్ట్ కూడా విమానం ఎక్కడానికి 96 గంటల ముందే చేయించుకొని ఉండాలి. తప్పుడు సమాచారమిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.  
 
* ఒకవేళ టెస్ట్ రిపోర్టు లేకపోతే ప్రయాణీకులు ఎయిర్ పోర్టులోనే యాంటిజెన్ టెస్ట్ చేయించుకోవచ్చు. ఆ రిపోర్టు నెగిటివ్ అని వస్తే వారిని 14 రోజులు హోంక్వారంటైన్ కు అనుమతిస్తారు. 
 
* ఎయిర్ పోర్టులో కోవిడ్ పరీక్షలు నిర్వహించడానికి అసవరమైన ప్రాంతాన్ని ఎయిర్ పోర్టు అధికారుల సహాయంలో ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించడం జరిగింది. 
 
* కోవిడ్ టెస్ట్ ల ఆవశ్యకతను తెలిపేలా తగిన బ్యానర్లను ఏర్పాటు చేయాలి. 
 
* ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను ఎయిర్ పోర్టులోని సిబ్బంది దగ్గర అందబాటులో ఉంచేలా ఆయా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.
 
* ఎయిర్ పోర్టులో కోవిడ్ పరీక్షలు చేయించుకున్న వారి నుంచి 500 రూపాయలు రుసుము వసూలు చేస్తారు. ఆ నగదుకు సంబంధించి రసీదు కూడా ఇస్తారు. 
 
ఈ వసూలు ప్రక్రియను కలెక్టర్ల ఆధ్వర్యంలో నియమించబడిన అధికారులు సంబంధిత లావాదేవీలను పర్యవేక్షిస్తుంటారు. ఈ లావాదేవీలన్నింటికి ప్రత్యేక బ్యాంకు అకౌంట్ ఏర్పాటు చేయాలి. ఆ నగదు ఏపీఎంఎస్ఐడిసి ఎండీ అకౌంట్ కు బదిలీ అవుతుంది.
 
* ఎయిర్ పోర్టుల్లో కోవిడ్ టెస్టులు చేయడాన్ని పర్యవేక్షించేందుకు ఒక అధికారిని నియమించాలి.
 సదరు అధికారి ఎయిర్ పోర్టుల్లో దిగిన ప్రయాణీకుల్లో పాజిటివ్ వచ్చినవారిని వేరు చేసి వారికి తగిన సూచనలు ఇవ్వాలి.
 
* ఎయిర్ పోర్టు్ల్లో చేసిన యాంటిజెన్ పరీక్షల ఫలితాలన్నింటినీ ఎప్పటికప్పుడు స్టేట్ పోర్టల్ లో పొందు పరచాలి.
 
* పాజిటివ్ వచ్చిన ప్రయాణీకులను కోవిడ్ నిబంధనల ప్రకారం తగిన సదుపాయాలతో ఆస్పత్రికి తరలించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ట్రంకు పెట్టెల్లోని నిధి... ఖజానా ఉద్యోగి ఖజానా!!