Webdunia - Bharat's app for daily news and videos

Install App

విందు భోజనం ఆరగించి మాయమైన వరుడు....

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (15:01 IST)
పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయు. పెళ్లికి వచ్చిన వారందరికీ మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. వారితోపాటు పెళ్లికొడుకు కూడా భోజనం చేశాడు. కొంత సమయానికి మండపంలో కలకలం రేగింది. వరుడు కనిపించడం లేదు. పెళ్లి కూతురు తరఫున వారికి గుబులు మొదలైంది. పారిపోయాడని అందరూ అనుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే విశాఖలోని కోరమాండల్ సమీపాన ఉన్న ఐఎంజీ కాలనీకి చెందిన కృష్ణ తన తల్లితో కలసి నివాసం ఉంటున్నాడు. ఇతనికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది. బుధవారం రాత్రి (ఫిబ్రవరి 20) పెళ్లి ఉండగా, విశాఖలోని శ్రీహరిపురం వద్ద ఉన్న యారాడపార్కు వద్ద గ్రౌండ్‌లో పెళ్లికి వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 
మధ్యాహ్న భోజన సమయంలో పెళ్లికొడుకు అందరితో భోజనం చేశాడు. కొంత సమయానికి కనిపించకుండా పోయాడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. వరుడు మరో అమ్మాయిని ఇష్టపడ్డాడని, ఈ పెళ్లి ఇష్టం లేకే ఆలా చేశాడని గుర్తించారు. కానీ వరుడు కొద్ది సేపటికి తిరిగి వచ్చేశాడు. కానీ వారి ఆగ్రహం చల్లారలేదు. ఇరు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. పెళ్లికూతురు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments