Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరణం మల్లేశ్వరిని అభినందించిన గవర్నర్ హరిచందన్

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (23:42 IST)
ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రప్రథమ క్రీడా విశ్వవిద్యాలయం ఉప కులపతిగా నియమితులైన ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. ఒలింపిక్ పతకం సాధించిన తొలి, ఏకైక భారతీయ మహిళా వెయిట్ లిఫ్టర్ గా కరణం మల్లేశ్వరికి తగిన గౌరవం దక్కిందన్నారు.

2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన మల్లేశ్వరి ప్రతిభను దేశ పౌరులు ఎల్లప్పటికీ గుర్తుంచు కుంటారని గవర్నర్ ప్రస్తుతించారు.  ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లు మొదలైన వాటిలో 11 బంగారు పతకాలు సహా 29 అంతర్జాతీయ పతకాలు సాధించి, అర్జున, పద్మశ్రీ,  రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులను అందుకున్న మల్లేశ్వరి దేశంలోని క్రీడాకారులకు ప్రేరణగా నిలిచారని ప్రశంసించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన  మల్లేశ్వరి దేశంలోని తొలి క్రీడా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా నియమించబడటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వించదగ్గ సందర్భమన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments