Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచితాలతో సోమరిపోతులు చేయొద్దు.. సంపాదించే శక్తినివ్వండి : నరసింహన్ సూచన

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాలన్నీ రద్దు చేయాలని కోరారు. ఉచితాలతో ప్రజలను సోమరిపోతులు చేయొద్దనీ, ప్రతి ఒక్కరికీ సంపాదించే శక్తినిచ్చి, ఆర్థిక స్వ

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (11:23 IST)
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాలన్నీ రద్దు చేయాలని కోరారు. ఉచితాలతో ప్రజలను సోమరిపోతులు చేయొద్దనీ, ప్రతి ఒక్కరికీ సంపాదించే శక్తినిచ్చి, ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రోత్సహించాలని కోరారు. 
 
హైదరాబాదులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఎఫ్ ట్యాప్సీ) శతాబ్ది ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు పల్లె సీమలను పట్టణాల మాదిరిగా తీర్చిదిద్దేందుకు పాటు పడాలన్నారు. తమ సీఎస్ఆర్ నిధులను పట్టణాలకు కాకుండా గ్రామీణ ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు.
 
ముఖ్యంగా సామాజికంగా వివిధ వర్గాలను ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సహిస్తేనే మంచి ఫలితాలుంటాయి. వారికి ఆర్థికంగా చేయూత ఇవ్వాలి. సంపాదించే శక్తిని ఇవ్వాలి. దాంతో వారు ఆత్మగౌరవంతో జీవనం కొనసాగిస్తారు. ఈ క్రమంలో ఉచిత పథకాలను తప్పనిసరిగా రద్దు చేయాలని ఆయన కోరారు. 
 
నిజానికి ప్రజలు అడక్కున్నప్పటికీ.. ప్రభుత్వాలు మాత్రం పోటీ పడుతూ ఉచితాల మంత్రాన్ని పఠిస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉచితానికి మంగళం పాడి, ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments