Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర‌ప‌తి మెడ‌ల్ గ్ర‌హీత వై.డి.రామారావుకు గ‌వ‌ర్న‌ర్ అభినంద‌న‌!

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (13:22 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్నర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ త‌న కార్యాల‌యంలో రాష్ట్ర‌ప‌తి మెడ‌ల్ గ్ర‌హీత వై.డి.రామారావుకు గ‌వ‌ర్న‌ర్ అభినంద‌న‌లు తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్య‌క్షుడు కూడా అయిన గ‌వ‌ర్న‌ర్ తూర్పుగోదావ‌రి రెడ్ క్రాస్ ఛైర్మ‌న్ రామారావు సేవ‌ల్ని కొనియాడారు.

ద‌శాబ్ద కాలంగా వై.డి.రామారావు రెడ్ క్రాస్ త‌ర‌ఫున సేవ‌లందిస్తున్నారు. ఇండియ‌న్ రెడ్ క్రాస్ సొసైటీ ప్ర‌తి ఏడాది జాతీయ స్థాయిలో రెండు బంగారు ప‌త‌కాల‌ను అందిస్తుంది. ద‌శాబ్దాలుగా రెడ్ క్రాస్ సేవ‌లందించిన వారికి ఈ ప‌త‌కాలు ఇస్తారు. ఈసారి రాష్ట్ర‌ప‌తి మెడ‌ల్  వై.డి.రామారావుకు రావ‌డం అభినంద‌నీయ‌మ‌ని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు.
 
రెడ్ క్రాస్ సొసైటీ కోవిడ్ స‌మ‌యంలోనూ సేవ‌ల్ని అందించింద‌ని, తూర్పుగోదావ‌రి జిల్లాలో ర‌క్త నిధి, కోవిడ్ బాధితుల‌కు సేవ‌లు అందించామ‌ని రామారావు వివ‌రించారు. దేశంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు త‌లెత్తిన‌పుడు రెడ్ క్రాస్ సేవ‌లు నిరుప‌మాన‌మ‌ని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు.

మామూలు స‌మయాల్లో అయితే, భారీ స‌భ ఏర్పాటు చేసి మెడ‌ల్ బ‌హూక‌రించాల్సింద‌ని, అయితే కోవిడ్ కార‌ణంగా గ‌వ‌ర్న‌ర్ భ‌వ‌న్లో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు గ‌వ‌ర్న‌ర్ కార్య‌ద‌ర్శి  ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 2018-19 సంవ‌త్స‌రానికి రాష్ట్ర‌ప‌తి మెడ‌ల్ గ్ర‌హీతగా వై.డి.రామారావుకు ఈ పుర‌స్కారం అందించామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రెడ్ క్రాస్ ఛైర్మ‌న్ ఎ.శ్రీధ‌ర్ రెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎ.కె. ప‌రీదా, త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments