Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రివర్గం నుంచి మంత్రి గుమ్మనూరు జయరాం బర్తరఫ్

ఠాగూర్
బుధవారం, 6 మార్చి 2024 (07:39 IST)
అందరూ ఊహించిందే జరిగింది. ఏపీలో అధికార వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాంను ఏపీ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈ మేరకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదేశాలు జారీచేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేయాలని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి.. మంత్రి జయరాంకు సూచించారు. కానీ, ఈ ప్రతిపాదన పట్ల మంత్రి జయరాం తీవ్ర అసంతృప్తితో కొనసాగుతూ, గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 
 
అదేసమయంలో టీడీపీలో చేరేందుకు ఆయన తన వంతు ప్రయత్నాలు చేశారు. ఇవి ఫలించడంతో పసుపు కండువా కప్పుకున్నారు. మంగళవారం మంగళగిరి వేదికగా జరిగిన బీసీ సభలో ఆయన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గం నుంచి జయరాంను బర్తరఫ్ చేయాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గవర్నర్‌కు సిఫార్సు చేశారు. దీంతో గవర్నర్ అబ్దుల్ నజీర్ బర్తరఫ్ చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments