Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్వాక్రా మహిళలకు శుభవార్త!

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (07:33 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త అందించింది. బ్యాంకు లింకేజీ ద్వారా డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయింది.

మహిళల బ్యాంకు అకౌంట్ లో రూపాయి జమ చేసి తర్వాత పూర్తి వడ్డీ చెల్లించనుంది. లక్ష రూపాయల లోపు తీసుకున్న డ్వాక్రా మహిళలకు 4 విడతల్లో రుణమాఫీ చేయనుంది. ఆ డబ్బులు జమ చేసే లోగా 6 నెలలకోసారి వడ్డీ చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. 
 
ఎన్నికలకు ముందు జగన్..నవరత్నాలు పథకాల్లో భాగంగా ‘వైఎస్ఆర్ ఆసరా’ ద్వారా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు.

2019 ఏప్రిల్ 11వ తేదీకి ముందు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ.840 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేయనున్నారు. నాలుగు విడుతల్లో ఈ రుణమాఫీ చేయనున్నారు. 
 
కానీ రుణం పొందిన మహిళలు తమ బకాయిని చెల్లిస్తూ ఉండాలి. ఆ తర్వాత రోజుల్లో ప్రభుత్వం నుంచి మాఫీ అయిన నగదు మొత్తం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments