Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిదేళ్ల చిన్నారిపై యేడాదిగా అత్యాచారం.. నెల్లూరులో దారుణం

జిల్లా కేంద్రమైన నెల్లూరులో దారుణం జరిగింది. ఓ వ్యక్తి మానవత్వాన్ని మరిచి మృగమయ్యాడు. రాక్షస అకృత్యాలకు పాల్పడ్డాడు. ముక్కు పచ్చలారని తొమ్మిదేళ్ల చిన్నారిపై ఏడాది కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతూ అఘ

Webdunia
ఆదివారం, 27 నవంబరు 2016 (09:49 IST)
జిల్లా కేంద్రమైన నెల్లూరులో దారుణం జరిగింది. ఓ వ్యక్తి మానవత్వాన్ని మరిచి మృగమయ్యాడు. రాక్షస అకృత్యాలకు పాల్పడ్డాడు. ముక్కు పచ్చలారని తొమ్మిదేళ్ల చిన్నారిపై ఏడాది కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతూ అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఆ కసాయి. మానవత్వం మంటగలిసే ఈ సంఘటనపై శనివారం రాత్రి నెల్లూరు గ్రామీణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... సైదాపురం మండలానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు మగపిల్లలు, ఒక అమ్మాయి. భర్త చనిపోవడంతో ఆమె తన ముగ్గురు పిల్లలతో నెల్లూరుకు వచ్చింది. ఈ క్రమంలో భార్యాబిడ్డలను వదిలేసి వచ్చిన పెంచలయ్య అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఐదేళ్లుగా వారు సహజీవనం చేస్తున్నారు. ఆమె పాచిపనికి వెళుతుండగా పెంచలయ్య డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆ మహిళ కుమార్తెను కూడా మాయమాటలతో లొంగదీసుకున్న తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి... యేడాది నుంచి అత్యాచారం జరుపుతున్నాడు.
 
ఇంట్లో ఎవరూ లేని సమయంలో టీవీలో నీలిచిత్రాలను చూపిస్తూ లైగింక దాడులకు తెగబడ్డాడు. శుక్రవారం ఆ చిన్నారి తాను చదువుతున్న పాఠశాలలో తోటి స్నేహితురాలికి ఈ విషయాన్ని చెప్పింది. ఆ విద్యార్థిని ఉపాధ్యాయులకు చెప్పగా వారు శనివారం ఐసీడీఎస్‌ అధికారులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న ఇందుకూరుపేట సీడీపీవో శారదాకుమారి, సూపర్‌వైజర్‌ లక్ష్మీప్రసన్న, ఐసీపీఎస్‌ సురేష్‌ ఆ చిన్నారితో పాటు తల్లిని వెంటబెట్టుకుని నెల్లూరు గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం