Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన లేకుండా జీవించాలని చెప్పి వెళ్లిపోయారు: ఫిడేల్ సన్నిహితుడు డెల్ కాండే

క్యూబా ప్రజల ఆరాధ్య దైవం ఫిడెల్‌ క్యాస్ట్రో ఇకలేరు. అయితే, ఒకప్పుడు ఆయనకు అండగా నిలిచి పోరాటయోధుడిగా తనను నిరూపించుకునేలా చేసిన ఆంటోనియో డెల్‌ కాండే మాత్రం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. క్యాస్ట్రో లే

Webdunia
ఆదివారం, 27 నవంబరు 2016 (09:31 IST)
క్యూబా ప్రజల ఆరాధ్య దైవం ఫిడెల్‌ క్యాస్ట్రో ఇకలేరు. అయితే, ఒకప్పుడు ఆయనకు అండగా నిలిచి పోరాటయోధుడిగా తనను నిరూపించుకునేలా చేసిన ఆంటోనియో డెల్‌ కాండే మాత్రం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. క్యాస్ట్రో లేడనే వార్త తెలుసుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. క్యాస్ట్రో మృతిపట్ల స్పందించేందుకు మాటలు రావడం లేదన్నారు. 
 
1956లో గ్రాన్మా అనే నౌకను ఫిడెల్‌ క్యాస్ట్రోకు ఏర్పాటు చేసింది ఈయనే. దీని ద్వారానే ఫిడెల్‌ ఆయనతోపాటు మొత్తం 8 2మంది మెక్సికో నుంచి క్యూబా వెళ్లి విప్లవాన్ని లేవదీశారు. అది విజయవంతమైంది. దీంతో అప్పటి నుంచి క్యాస్ట్రోకు ఆంటోనియో మంచి మిత్రుడయ్యారు. ఆంటోనియోపై క్యాస్ట్రో పలుమార్లు ప్రశంసలు కురిపించారు.
 
ఈ నేపథ్యంలో క్యాస్ట్రో మృతి విషయం తెలుసుకున్న ఆయన వెంటనే మరికొందరు మెక్సికన్లతో కలిసి క్యూబా రాయబార కార్యాలయానికి వెళ్లి తన సంతాపం ప్రకటించారు. 'క్యాస్ట్రో చనిపోయారని తెలిసి నాకు ఏం మాటలు రావడం లేదు. ఆయన నాకు కొత్త జీవితాన్ని తెలిపాడు. ఇప్పుడాయన లేకుండా జీవించాలని చెప్పి వెళ్లిపోయారు' అని కన్నీటిపర్యంతం అయ్యారు. 
 
క్యూబా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10.30కి ఫిడేల్ కన్నుమూశారు. ఈ నెల 26 నుంచి తొమ్మిది రోజులను సంతాప దినాలుగా క్యూబా ప్రభుత్వం ప్రకటించింది. నాలుగురోజుల పాటు దేశమంతా క్యాస్ట్రో పార్థివదేహంతో యాత్ర జరిపి డిసెంబర్ 4న శాంటియాగోలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమ అభిమాన నాయకుడి మరణవార్తతో క్యూబా శోకసంద్రంలో మునిగిపోయారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments