Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమ్మి అతిథ్యమిస్తే... యువతిపై బావ అత్యాచారం... మరో ఇద్దరు కూడా..

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. యువతిపై బావే అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటికి వచ్చిన బావకు ఆతిథ్యమిచ్చినందుకు ఆ యువతి తన శీలాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పైగా, ఈ అత్యాచారాన్ని చూసిన మరో ఇద్దరు కూడా ఆ

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (08:59 IST)
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. యువతిపై బావే అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటికి వచ్చిన బావకు ఆతిథ్యమిచ్చినందుకు ఆ యువతి తన శీలాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పైగా, ఈ అత్యాచారాన్ని చూసిన మరో ఇద్దరు కూడా ఆ యువతిపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి తెగబడ్డారు. వరంగల్‌ జిల్లా కాజీపేటలో శనివారం అర్థరాత్రి ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన యువతి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పనిచేస్తోంది. కరీంనగర్‌ జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం మల్యాల గ్రామానికి చెందిన పొన్నం అంజయ్య(30)కు ఆమె మరదలు వరుస అవుతుంది. హైదరాబాద్‌ వచ్చిన అంజయ్య.. ఆ యువతి ఇంటికి వెళ్లాడు. 
 
అంజయ్య తోడుగా ఉంటాడన్న నమ్మకంతో మల్యాల గ్రామంలోని బంధువుల ఇంటికి బయలుదేరింది. వీరు సికింద్రాబాద్‌లో పుష్‌పుల్‌ రైలెక్కి కాజీపేటలో శనివారం రాత్రి 10-30 గంటలకు దిగారు. మల్యాల వెళ్లేందుకు మరో రైలు ఎక్కాలని ఆమెకు చెప్పిన అంజయ్య.. రైలు పట్టాల వెంట టౌన్ స్టేషన్ సమీపంలోకి తీసుకొచ్చి అత్యాచారానికి ఒడిగట్టాడు. వీరిద్దరిని పసిగట్టిన మరో ఇద్దరు... ఆమెను బెదిరించి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు కాజీపేట పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments