Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్.. ఛేజింగ్‌లో పోలీసులదే విజయం.. ప్రేమించలేదని?

సినీ ఫక్కీలో ఓ యువతి కిడ్నాప్ జరిగింది. కిడ్నాపర్లను ఛేజింగ్ చేసిన పోలీసులు చివరికి సక్సెస్ అయ్యారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రేమిస్తున్నానని ఓ యువతి వెంటపడ్డాడు ఓ

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (14:06 IST)
సినీ ఫక్కీలో ఓ యువతి కిడ్నాప్ జరిగింది. కిడ్నాపర్లను ఛేజింగ్ చేసిన పోలీసులు చివరికి సక్సెస్ అయ్యారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రేమిస్తున్నానని ఓ యువతి వెంటపడ్డాడు ఓ యువకుడు. ఆమె యువకుడి ప్రేమను నిరాకరించింది. అంతే ఇక లాభం లేదనుకున్న ఆ యువకుడు యువతిని కిడ్నాప్ చేసి పరారయ్యాడు. ఈ కిడ్నాప్‌కు స్నేహితుల సహాయాన్ని అర్థించాడు. చివరికి పోలీసులు కిడ్నాపర్ల వెంటపడటంతో వారే గెలిచారు. 
 
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం బస్టాండ్ వద్ద నిల్చున్న యువతిని కారులో వచ్చిన దుండగులు బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్తున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కారును వెంబడించి.. బుచ్చినాయుడు కండ్రిగ వద్దకు చేరుకుంటున్న సమయంలో కిడ్నాపర్లను చుట్టుముట్టి.. యువతిని రక్షించారు. 
 
దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిన పోలీసులు... నెల్లూరు జిల్లా, మనుబోలుకు చెందిన సతీష్ అనే యువకుడే కిడ్నాప్‌కు ఒడిగట్టాడని గుర్తించారు.  బాధితురాలు ప్రేమకు అంగీకరించకపోవడంతో స్నేహితుల సాయంతో కిడ్నాప్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments