Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారిని చిదిమేసిన చక్రాలు: పాప తలపై నుంచి వ్యాన్ ముందుకు వెళ్లడంతో..?

Webdunia
శనివారం, 12 ఫిబ్రవరి 2022 (11:22 IST)
ఓ చిన్నారిని చక్రాలు చిదిమేశాయి. ఓ రోడ్డు ప్రమాదం రూపంలో చిన్నారిని మృత్యువు కబళించింది. తల్లి, అమ్మమ్మతో కలిసి చిన్నారి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ఓ వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నరి రోడ్డుపై పడిపోగా.. తలపై నుంచి వ్యాన్ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో తోట సుమన్ విధులు నిర్వహిస్తున్నారు. 
 
డ్యూటీలో భాగంగా సుమన్ మూడ్రోజులు అంతర్వేదికి వెళ్లారు. అల్లుడు ఊళ్లో లేకపోవడంతో.. అత్త దుర్గాభవాని కూతురు స్వరూప, మనుమరాలు ఆద్యలను తన ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రతిపాడు వచ్చింది. ముగ్గురూ ద్విచక్రవాహనంపై వేమగిరికి బయల్దేరారు. 
 
రాజానగరం సమీపంలోకి రాగానే.. వెనుక నుంచి ఓ వ్యాను అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. అక్కడితో ఆగకుండా పాప తలపై నుంచి వ్యాన్ ముందుకు వెళ్లిపోవడంతో.. చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి, అమ్మమ్మలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments