సీఎం జగన్‌తో ఆదానీ భేటీ... గంగవరం పోర్టు - వైజాగ్ డేటా సెంటర్‌పై చర్చ

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (14:57 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ ఆదానీ గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన... తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నాలుగు గంటల పాటు అక్కడే ఉన్న ఆదానీ.. సీఎం జగన్ నివాసంలోనే రాత్రి విందు భోజనం ఆరగించారు. ఆ తర్వాత ఆయన ప్రత్యేక విమానంలో ముంబైకు చేరుకున్నారు. గౌతమ్ ఆదానీ, సీఎం జగన్ భేటీ గురించి ముందస్తుగా ఎలాంటి అధికారిక సమాచారం కానీ, భేటీ తర్వాత ప్రకటన గానీ ఏపీ ప్రభుత్వం లేదా సీఎంవో చేయలేదు. 
 
అయితే, తమ భేటీ గురించి అదానీ గురువారం అర్థరాత్రి 12 గంటలకు ఓ ట్వీట్ చేశారు. "ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఎప్పట్లాగే సానుకూలంగా జరిగింది. ఏపీలో అదానీ సంస్థల పెట్టుబడులు, ముఖ్యంగా, గంగవరం పోర్టు, వైజాగ్ డేటా సెంటర్‌పై చర్చించాం. ఈ ప్రాజెక్టులు అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీలకమని మేం ఇరువురం భావిస్తున్నాం" అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments