Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవ‌నిగ‌డ్డ గాంధీ క్షేత్రంలో... గాన గంధ‌ర్వ బాలు ప్ర‌థ‌మ వ‌ర్ధంతి

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (13:54 IST)
గాన గంధ‌ర్వుడు, గాత్ర బ్ర‌హ్మ  ఎస్పీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యం మృతి చెంది అపుడే ఏడాది గ‌డిచిపోయింది. ప్రముఖ చలన చిత్ర గాయకుడు గాన గంధర్వ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతిని దివిసీమ‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. దివిసీమ లలిత కళా సమితి ఆధ్వర్యంలో అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఘనంగా నివాళులు అర్పించారు.
 
ఈ సందర్భంగా లలిత కళా సమితి అధ్యక్షులు పుప్పాల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి కూనపరెడ్డి చంద్రశేఖర రావు మాట్లాడుతూ, పాట ఉన్నంత కాలం బాల సుబ్రమణ్యం జీవించే ఉంటార‌ని అన్నారు.   బాల సుబ్రహ్మణ్యం పాటలు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరించాయ‌ని, ఐదు దశాబ్దాల పాటు దాదాపు అన్ని భాషలలో 40 వేల పాటలు పాడి ఎన్నోఅవార్డులు అందుకున్న బాలు చిర‌స్మ‌ర‌ణీయుడ‌ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  స్థానిక గాయని ఎన్. జ్యోతి, బాలసుబ్రహ్మణ్యం  అభిమానులు, గాయకులు పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments