Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేధిస్తున్నాడనీ.. మడ్డికల్లు తాపించి చంపేసిన ప్రేమికులు ... ఎక్కడ?

Webdunia
గురువారం, 23 జులై 2020 (13:55 IST)
ఎంత చెప్పినా వినకుండా నిత్యం వెంటపడి వేధిస్తున్నాడన్న కారణంతో ఓ వ్యక్తిని ప్రేమికులైన ఓ యువతి, ఓ యువకుడు కలిసి చంపేశాడు. అంతేనా... రెండు రోజుల తర్వాత మరోమారు మృతదేహం వద్దకు వెళ్లి... దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించి వచ్చారు. అయితే, వీరి నేరాన్ని మృతుడి చేతికువున్న కడియం, మెడలోని గొలుసు వెలుగులోకి తెచ్చాయి. ఈ ఘటన గాజువాక గుడివాడలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గాజువాక గుడివాడ అప్పన్నకాలనీకి చెందిన గుర్రం గణేశ్‌(38), మల్కాపురం హనుమాన్‌గుడి సమీపంలో నివాసం ఉంటున్న గుంటు దీనా అలియాస్‌ స్వాతి(21) పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వచ్చేవాడు. అప్పటికే ప్రేమలో ఉన్న స్వాతి.. ఈ విషయాన్ని తన ప్రియుడు జోగారావు (27)కు చెప్పింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి గణేశ్‌ను హెచ్చరించారు. 
 
అయినా గణేశ్ పట్టించుకోలేదు. ఇతన్ని ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన ప్రేమికులిద్దరూ గణేశ్‌ను చంపేయాలని నిర్ణయించారు. అంతే... తమ పథకంలో భాగంగా ఈ నెల 5వ తేదీ గ్లోబెక్స్‌ షాపింగ్‌మాల్‌ వెనుక పాడుబడిన చేపల కంపెనీ వద్దకు పిలిపించారు. అక్కడ పూటుగా మడ్డికల్లు తాగించారు. దీంతో గణేశ్ మత్తులోకి జారుకున్నాడు. ఆ తర్వాత గణేశ్‌ కాళ్లు, చేతులు కట్టేశారు. ఒక కర్రతో తలపై స్వాతి గట్టిగా కొట్టగా, ప్యాంటు బెల్టు తీసి, అతని మెడకు బిగించి హత్య చేశాడు. 
 
మృతదేహాన్ని పక్కనే ఉన్న కాలువలోకి తోసేసి వెళ్లిపోయారు. రెండు రోజుల తర్వాత మళ్లీ వచ్చి మృతదేహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఈ నెల 13న కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందంటూ గుడివాడ అప్పన్నకాలనీ వీఆర్‌ఓ ఎ.కార్తీక్‌ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
 
అంతేకాకుండా, హత్యాస్థలాన్ని పరిశీలించిన పోలీసులకు... అక్కడ ఓ గొలుసుతో పాటు.. చేతి కడియం లభించింది. వీటి ఆధారంగా పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాకబు చేశారు. ఇవి గుడివాడ అప్పన్నకాలనీకి చెందిన గర్రం గణేశ్‌విగా అతని తల్లిదండ్రులు గుర్తించారు. అప్పుడప్పుడు పది, పదిహేను రోజులపాటు ఎక్కడికోవెళ్లి వస్తుంటాడని, ఇప్పుడూ అలాగే వెళ్లి వుంటాడన్న భావనతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తల్లిదండ్రులు చెప్పారు. 
 
ఆ తర్వాత గణేశ్‌కు ఉన్న శత్రువులు, ఇటీవల జరిగిన వివాదాల గురించి పోలీసులు ఆరా తీయగా జోగారావు, స్వాతి విషయం బయటపడింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి నిందితులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sonu Sood : సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

Vijay: దళపతి విజయ్ భారీ చిత్రం జన నాయగన్ వచ్చే సంక్రాంతికి విడుదల

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments