జీవో నెం. 64ను తక్షణమే ఉపసంహరించుకోవాలి: నాదెండ్ల మనోహర్

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (08:10 IST)
వైద్య సేవలో ఉన్నవారిపై జూనియర్ అధికారులతో కర్ర పెత్తనం చేయించాలనుకోవద్దని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన జీవో నెం. 64ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ వైద్యుల గౌరవాన్ని తగ్గించే ఉత్తర్వులు సరికాదన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన మందుల సరఫరాపై దృష్టిపెట్టాలని సూచించారు. మౌలిక వసతులు మెరుగుపరచాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను మరచిపోయిందని విమర్శించారు. 

ప్రభుత్వ వైద్యులపై పెత్తనం చేసే అధికారాన్ని జాయింట్ కలెక్టర్-2కి అప్పగించడం ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమని వ్యాఖ్యానించారు.

ఈ నిర్ణయం వైద్యులకు ఉన్న గౌరవాన్ని తగ్గిస్తుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై కర్ర పెత్తనం చేసేందుకే ఉత్సాహపడటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments