Webdunia - Bharat's app for daily news and videos

Install App

భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ర్షిస్తున్న ఫల - పుష్పాలంక‌ర‌ణ‌లు

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (15:30 IST)
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయం లోపల ఆపిల్‌, ద్రాక్ష, కర్బూజ, మామిడి, చెరకు వంటి విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో  శ్రీవారి ఆలయాన్ని శోభాయమానంగా  రూపొందించారు.
 
శ్రీవారి ఆలయంలో ధ్వజస్థంభం చెంత పుచ్చకాయలతో ఆకర్షణీయంగా చెక్కిన శ్రీ మ‌హావిష్ణువు ద‌శ‌వ‌తారాలు, మొద‌టిసారిగా టెంకాయ ఆకుల‌తో జ‌నూర్ ఆర్ట్‌తో రూపొందించిన క‌ళాకృతులు, న‌వ‌దాన్యాల‌తో సిద్ధంచేసిన శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సంహ‌స్వామివారి విగ్ర‌హాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
అదేవిధంగా ఆలయం బయట వివిధ రకాల పుష్పాలతో ఐరావతాలు (ఏనుగులు), ఉగాది ప్రారంభం పౌరాణిక నేప‌థ్యం, చిన్ని కృష్ణుడు మామిడి కాయ‌లు కోస్తున్న‌సెట్టింగులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
 
టిటిడి ఉద్యాన‌వ‌న విభాగం సిబ్బంది, కర్ణాటక, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన నైపుణ్యం గ‌ల 100 మంది నిపుణులు భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా వినూత్నంగా అలంకరణలు చేశారు.  
 
హైద‌రాబాద్‌కు చెందిన సంస్థ లార‌స్ ల్యాబ్స్ లిమిటెడ్ వారు 8 టన్నుల సాంప్రదాయ పుష్పాలు,  70 వేల‌ కట్ ఫ్ల‌వ‌ర్స్, వివిధ ర‌కాల ఫ‌లాలు అందించారు.  

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments