Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి మృతి

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (18:21 IST)
నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి సోమవారం కన్నుమూశారు. గత యేడాది కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆయన నెల్లూరులోని తన నివాసంలో చనిపోయారు. 
 
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎంతో క్రియాశీలంగా ఉన్న శ్రీధర్ కృష్ణారెడ్డి గత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్‌పై 90 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 
 
నెల్లూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడుగా, నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న ఈయన పార్టీ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్‌పై 14 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 
 
2009లో ఆయనకు టీడీపీ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ తరపున టిక్కెట్‌పై పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున నారాయణ విద్యా సంస్థల అధినేత పి.నారాయణ పోటీ చేసి ఓడిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరువు రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నా: మెగాస్టార్ చిరంజీవి

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి.. రెండేళ్ల సహజీవనం తర్వాత?

‘కల్కి 2898 AD’ కాశీ, కాంప్లెక్స్‌, శంబాలా అనే త్రీ వరల్డ్స్ మధ్య నడిచే కథ : డైరెక్టర్ నాగ్ అశ్విన్

వరుణ్ తేజ్ మట్కా న్యూ లెన్తీ షెడ్యూల్ హైదరాబాద్ RFCలో ప్రారంభం

అహో! విక్రమార్క' అంటూ హీరోగా వస్తున్న దేవ్ గిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బాదం పిసిన్‌ను మహిళలు ఎందుకు తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments