Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయలసీమను 14 జిల్లాలుగా విభజించాలి: బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (19:15 IST)
byreddy rajasekhar reddy
ఏపీలో ఇటీవల చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటుపై మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు.  ఏపీలోని జగన్ సర్కారును పనిలో పనిగా ఏకిపారేశారు. 
 
ప్రజల వద్దకే పాలన ఉండాలని నాటి సీఎం ఎన్టీఆర్ పరిపాలన సాగించారని… ఎమ్మార్వో అని ఎన్టీఆర్ పెడితే.. వైఎస్ఆర్ వచ్చి తహసీల్దార్ అని పేరు మార్చారన్నారు. ఎన్టీఆర్ ప్రజల వద్దకు పాలన తెస్తే.. జగన్ ప్రజలకు దూరంగా పాలన సాగిస్తున్నాడని బైరెడ్డి విమర్శించారు. జగన్ తుగ్లకా జగ్లకా అనేది తనకు అర్థం కావడం లేదన్నారు. 
 
అంతేగాకుండా.. రాయలసీమలోని నాలుగు జిల్లాలు చాలా పెద్దవిగా ఉంటాయని.. అందువల్ల రాయలసీమను 14 జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలోని 13 రాష్ట్రాల వైశాల్యం కంటే రాయలసీమ వైశాల్యం పెద్దగా ఉంటుందని బైరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు సంబంధించి ఒక్కో జిల్లాను నాలుగు జిల్లాలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు బైరెడ్డి తెలిపారు.
 
కడప, చిత్తూరు జిల్లాలను మూడు జిల్లాల చొప్పున ఆరు జిల్లాలుగా విభజించాలని కోరారు. ఆదోనీని జిల్లా చేయాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నామని గుర్తుచేశారు. అటు చిత్తూరు జిల్లాలోని మదనపల్లెను కూడా జిల్లాగా చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అయ్యప్ప మాలతో చెర్రీ దర్గా దర్శనం.. ఉపాసన అదిరే సమాధానం.. ఏంటది?

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

నిజాయితీగా పనిచేస్తే సినీ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. బోయపాటి శ్రీను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments